Sania Mirza: మక్కాలో సానియా మీర్జాను కలిసిన టాలీవుడ్ హీరోయిన్.. చంటి పిల్లాడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

ఇందులో సానియా, ఆనమ్ మీర్జాల మధ్యలో చంటి పిల్లాడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్. నాగార్జున, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ తదితర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది.

Sania Mirza: మక్కాలో సానియా మీర్జాను కలిసిన టాలీవుడ్ హీరోయిన్.. చంటి పిల్లాడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
Sania Mirza
Follow us
Basha Shek

|

Updated on: Jun 17, 2024 | 8:51 AM

టీమిండియా టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా హజ్ యాత్రకు బయలు దేరిన సంగతి తెలిసిందే. సానియాతో పాటు ఆమె సోదరి అనమ్ మీర్జా తదితరులు మక్కాను సందర్శించేందుకు వెళ్లారు. తాజాగా వీరిద్దరు మక్కాలో కొన్ని ఫొటోలు దిగారు. పై ఫొటో అందులోదే. ఇందులో సానియా, ఆనమ్ మీర్జాల మధ్యలో చంటి పిల్లాడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్. నాగార్జున, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ తదితర హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. ముఖ్యంగా బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సనాఖాన్.

అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పిన సనాఖాన్..

తెలుగు సినిమాల్లోకి రాక ముందు పలు హిందీ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది సనాఖాన్. ఆ తర్వాత కల్యాణ్ రామ్ కత్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. నాగార్జున గగనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మంచు మనోజ్ తో కలిసి మిస్టర్ నూకయ్య సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నూ నటించింది. అయితే ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుందీ అందాల తార. అనస్ సయ్యద్‌ తో కలిసి పెళ్లి పీటలెక్కింది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్‌ అనే 11 నెలల బాబు ఉన్నాడు. ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగి తేలుతోన్న సనాఖాన్ ఇప్పుడు అనూహ్యంగా సానియా మీర్జాను కలిసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది సనాఖాన్. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మక్కా యాత్రలో సానియా సోదరీ మణులతో సనాఖాన్..

సానియా ట్వీట్ ఇదిగో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.