AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మిర్రర్ సెల్ఫీ దిగుతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఒక్క సినిమా తీయకుండానే మస్త్ ఫాలోయింగ్

పై ఫొటోల్లో మిర్రర్ సెల్ఫీ దిగుతున్నది ఎవరో గుర్తు పట్టారా?ఈమె ఒక టాలీవుడ్ సెలబ్రిటీ. అలాగనీ ఆమె ఒక్క సినిమా కూడా చేసింది లేదు. అయితే ఆమె తల్లి మాత్రం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాల్లో నటించింది. అక్క, వదిన, కోడలు, భార్య, పిన్ని ఇలా ఏ రోల్ చేసినా పాత్రకు ప్రాణం పోస్తుంది.

Tollywood: మిర్రర్ సెల్ఫీ దిగుతోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఒక్క సినిమా తీయకుండానే మస్త్ ఫాలోయింగ్
Tollywood Celebrity
Basha Shek
|

Updated on: Jun 16, 2024 | 8:58 AM

Share

పై ఫొటోల్లో మిర్రర్ సెల్ఫీ దిగుతున్నది ఎవరో గుర్తు పట్టారా?ఈమె ఒక టాలీవుడ్ సెలబ్రిటీ. అలాగనీ ఆమె ఒక్క సినిమా కూడా చేసింది లేదు. అయితే ఆమె తల్లి మాత్రం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాల్లో నటించింది. అక్క, వదిన, కోడలు, భార్య, పిన్ని ఇలా ఏ రోల్ చేసినా పాత్రకు ప్రాణం పోస్తుంది. ఇప్పుడు తన వారసురాలిగా కూతురును ఇండస్ట్రీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అందుకే సోషల్ మీడియాలో తల్లీ కూతుళ్లు కలిసి తెగ హంగామా చేస్తున్నారు. పలు సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తాజాగా ఆ సీనియర్ నటి కూతురు షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో చేతికి హ్యాండ్ బ్యాగ్, మిర్రర్ సెల్ఫీ దిగుతూ కనిపించిందీ స్టార్ కిడ్. మత్తెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. యస్. ఈ సొగసరి మరెవరో కాదు సురేఖా వాణి గారాల పట్టి సుప్రిత.

కాగా త్వరలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది సుప్రిత. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఆమె ఒక సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మల్యాద్రి రెడ్డి దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్3 మీడియా బ్యానర్‌లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మిస్తాడు బలగం రూపశ్రీ, రాజా రవీంద్ర, వినోద్ కుమార్, ఎస్తేర్, సురేఖా వాణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఇదే ఏడాది సుప్రిత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

సుప్రిత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

సుప్రిత లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్..

ఐపీఎల్ మ్యాచుల్లో జబర్దస్త్ రీతూతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us