Pushpa 2: పుష్ప రాజ్‌కు పోటీగా ఇన్ని సినిమాలా..!! డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రోజున

పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప సినిమా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. ఇక పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి

Pushpa 2: పుష్ప రాజ్‌కు పోటీగా ఇన్ని సినిమాలా..!! డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రోజున
Pushpa 2
Follow us

|

Updated on: Jun 16, 2024 | 9:08 AM

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ జంటగా నటిస్తున్న భారీ మూవీ పుష్ప 2. ఈ  సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అంతకు ముందు వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప సినిమా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. ఇక పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ నుంచి పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. పుష్ప 2 నిర్మాతలు చాలా కాలం క్రితం ఆగస్టు 15 విడుదల కోసం లాక్ చేశారు. అయితే ఈ సారి ఆగస్ట్ 15న చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప సినిమాకు పోటీగా మరో సినిమా రిలీజ్ కానుంది. రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఐ స్మార్ట్ సినిమా కూడా ఆగస్ట్ 15న విడుదల కానుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈమేరకు ఇటీవలే అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 మేకర్స్ రిలీజ్ డేట్ మార్చకపోతే రెండు సినిమాల మధ్య క్లాష్ రావడం ఖాయం. ‘డబుల్ ఐ స్మార్ట్’ మూవీ 2019 సంవత్సరంలో విడుదలైన ‘ఐ స్మార్ట్ శంకర్’కి సీక్వెల్. ఈ  రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్‌ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. అంతకు ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. సంజయ్ గతంలో కెజిఎఫ్ 2, లియో వంటి సౌత్ సూపర్‌హిట్ చిత్రాలలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలే కాదు మరికొన్ని సినిమాకు కూడా  ఆగస్టు 15న పోటీ పడనున్నాయి.  బాలీవుడ్ నుంచి కూడా చాలా సినిమాలను విడుదల చేస్తున్నారు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2, అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, వాణి కపూర్, అమీ విర్క్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ అలాగే జాన్ అబ్రహం , శార్వరి వాఘ్‌ల వేద ఆగస్టు 15న వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పుష్ప 2 వసూళ్లకు ఈ సినిమాలన్నీ అడ్డుకట్ట వేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ పోటీని పుష్ప రాజ్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles