Pawan Kalyan: పవన్‌కు రూ. లక్ష విలువచేసే పెన్ను గిఫ్ట్‌.. దీని స్పెషాలిటీ ఏంటంటే..

పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్‌ దేశ రాజకీయాల్లోనే సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. తొలిసారి రాజకీయాల్లో విజయం సాధించిన పవన్‌ ఏకంగా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు చంద్రబాబు క్యాబినెట్‌లో పంచాయతీరాజ్‌ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇలా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో లేదో...

Pawan Kalyan: పవన్‌కు రూ. లక్ష విలువచేసే పెన్ను గిఫ్ట్‌.. దీని స్పెషాలిటీ ఏంటంటే..
Pawankalyan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 2:52 PM

పవన కళ్యాణ్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఒక సంచనలం. సినిమాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న పవన్‌ రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడనే అపకీర్తి సంపాదించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ అపోహలను, అపకీర్తిని పటాపంచలు చేస్తూ అద్భుత విజయాన్ని నమోదుచేసుకొని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, కూటమి విజయంలో ప్రధాన భూమిక పాత్ర పోషించి తనదైన ముద్ర వేశారు.

పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్‌ దేశ రాజకీయాల్లోనే సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. తొలిసారి రాజకీయాల్లో విజయం సాధించిన పవన్‌ ఏకంగా ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు చంద్రబాబు క్యాబినెట్‌లో పంచాయతీరాజ్‌ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇలా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో లేదో అనంతరం పవన్‌.. తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా తన భార్యతో కలిసి అన్న, వదినలను కలుసుకున్నారు. అయితే ఇదే సమయంలో చిరు భార్య సురేఖ.. పవన్‌కు అరుదైన బహుమతిని ఇచ్చింది. వాల్ట్‌ డిస్నీకి చెందిన మోంట్‌ బ్లాంక్‌ పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడీ ఈ పెన్నుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. పెన్నులో అంత గొప్ప ఏముందనేగా మీ సందేహం. అయితే ఈ పెన్ను ధర ఎంతో తెలుసా.? అక్షరాల రూ. లక్ష పైమాటే. మోంట్‌ బ్లాక్‌ డిస్నీ ఎడిషన్‌ పెన్నులు సుమారు రూ. 90 వేల నుంచి ఏకంగా రూ. రెండున్నర లక్షల వరకు ఉంటాయి.

దీంతో ఇప్పుడీ అంశం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ పెన్ను గురించి ఫ్యాన్స్‌ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇక సురేఖ పెన్ను బహకరిస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. వీడియోలో.. సురేఖ స్వయంగా పెన్ను తీసి పవన్‌ జేబులో పెట్టారు. అది చూసి పవన్‌ తెగ సంతోషపడ్డారు. అప్పటికే ఆయన వద్ద ఉన్న పెన్ను తీసి చూపించగా, ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అన్నట్లు సురేఖ చెప్పారు. ఆ వెంటనే ఒకవైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్‌ సతీమణి అన్నా లెజినోవా వచ్చి ఫొటోకు ఫోజిచ్చారు. ‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు.

ఈ పెన్ను ప్రత్యేతకలు ఏంటంటే..

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డిస్నీకి చెందిందే ఈ మోంట్‌ బ్లాంక్‌.. ఈ కంపెనీ లగ్జరీ పెన్నులు, రీఫిల్స్‌, బ్యాగ్స్‌, లెదర్‌ వస్తువులు, వాచీలు, సెంట్స్‌ తదితర వస్తువులను తయారు చేస్తుంది. ఇక మోంట్‌ బ్లాంక్‌ పెన్నును లిమిటెడ్‌ ఎడిషన్‌తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని పెన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మోనోరైల్ సిస్టమ్‌ స్ఫూర్తితో ఈ పెన్నును తయారు చేశారు. ప్లాటినమ్‌ కోట్‌తో ఈ పెన్‌ను రూపొందించడమే దీని ధరకు కారణంగా చెబుతారు. 1901లో ఈ కంపెనీ పెన్నులను తయారు చేయడం ప్రారంభించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles