అఖిల్‌కు గాయం.. చిత్రయూనిట్‌ను కొట్టడానికి వెళ్లిన నాగార్జున.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు

అక్కినేని అనే బ్రాండ్ నుంచి వచ్చిన అఖిల్ సక్సెస్ సాదించలేకపోతున్నాడు. బడా దర్శకులతో సినిమాలు చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. మనం సినిమాలో చిన్న రోల్ తో గెస్ట్ గా కనిపించాడు అఖిల్. ఆతర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే టైటిల్ తో సినిమా చేసి హీరోగా పరిచయం అయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు వివి వినాయక్.

అఖిల్‌కు గాయం.. చిత్రయూనిట్‌ను కొట్టడానికి వెళ్లిన నాగార్జున.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు
Nagarjuna
Follow us

|

Updated on: Jun 16, 2024 | 9:43 AM

అక్కినేని అఖిల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నడు. చిన్న చిన్న హీరోలు కూడా హిట్స్ అందుకుంటుంటే అఖిల్ మాత్రం ఏళ్ల తరబడి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కినేని అనే బ్రాండ్ నుంచి వచ్చిన అఖిల్ సక్సెస్ సాదించలేకపోతున్నాడు. బడా దర్శకులతో సినిమాలు చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. మనం సినిమాలో చిన్న రోల్ తో గెస్ట్ గా కనిపించాడు అఖిల్. ఆతర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే టైటిల్ తో సినిమా చేసి హీరోగా పరిచయం అయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు వివి వినాయక్. కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బోల్తా కొట్టడంతో అక్కినేని అభిమానులు నిరాశపడ్డారు.

ఆతర్వాత వరుసగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు అఖిల్. హలో, మిస్టర్ మజ్ను , సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఆ హిట్ అక్కినేని అభిమానులకు సరిపోలేదు. అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలని ఆశపడ్డారు. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేశాడు. అబ్బో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఏకంగా పెద్ద బిల్డింగ్ పై నుంచి జంప్ చేసి మరీ సినిమాను ప్రమోట్ చేశాడు అఖిల్. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.

దాంతో ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇదిలా ఉంటే అఖిల్ చిన్నతనంలోనే సిసింద్రీ అనే సినిమాతో పరిచయం అయిన విషయం తెలిసిందే.. శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో సిసింద్రీ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. అఖిల్ పసి వాడు కావడంతో రోజూ అమల షూటింగ్ కు వచ్చి అన్ని దగ్గరుండి చూసుకునేవారట. ఓవేళ అమల రాకుంటే కేర్ టేకర్ వచ్చేదట. ఓ రోజు నాగార్జున వేరే షూటింగ్ కు వెళ్లారట.. అమల కూడా ఆ రోజు షూటింగ్ కు రాలేదట.. కేర్ టేకర్ గా ఉన్న అమ్మాయి ఎదో పని ఉందంటూ బయటకు వెళ్ళింది. ఆ సమయంలో అఖిల్ ఆడుకుంటూ వెళ్లి ఓ టీ పాయ్ పై పడ్డాడు. పెద్దగా దెబ్బలు ఏం తగల్లేదు కానీ కంటిదగ్గర చిన్న గీత పడింది. వెంటనే నాగార్జునగారికి , అమల గారికి ఫోన్లు వెళ్లాయి. అంతే నాగార్జున ఒక కారులో, అమల మరో కారులో వచ్చారు. నేను నా అసిస్టెంట్ కు చెప్పను ఖచ్చితంగా నాగార్జున కొడతారు. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి.. ఒకవేళ తప్పించుకొని పారిపోతే ఆయన కోపం మరింత పెరిగిపోతుంది అని చెప్పాను. నాగార్జున ఫ్రెండ్ సతీష్ కూడా వచ్చారు. ఆయన ఆ టెన్షన్ వాతావరణాన్ని కూల్ చేశారు. పిల్లలన్నాక దెబ్బలు తగులుతాయి. అయినా చిన్నదే కదా అని నాగార్జునను కూల్ చేశారు. దాంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాం అని అన్నారు దర్శకుడు శివ నాగేశ్వర రావు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles