Viral video: దేర్ దేర్.. సి సి.. బ్యాక్ సైడ్.. యనకమాల..! ఎంతపని చేశావురా అయ్యా..!

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన టక్కున సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వాడకంతో పాటు ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ హంగామా ఎక్కువైంది. ప్రతిఒక్కరు దీనికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా యూత్.. రీల్స్ చూస్తూ కొంతమంది రీల్స్ చేస్తూ కొంతమంది టైం ను వృధా చేసుకుంటున్నారు. ఇక రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. ఇప్పటికే చాలా మంది వీటి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

Viral video: దేర్ దేర్.. సి సి.. బ్యాక్ సైడ్.. యనకమాల..! ఎంతపని చేశావురా అయ్యా..!
Viral Video
Follow us

|

Updated on: Jun 16, 2024 | 10:16 AM

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు.. నిత్యం వందల సంఖ్యలో వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన టక్కున సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వాడకంతో పాటు ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ హంగామా ఎక్కువైంది. ప్రతిఒక్కరు దీనికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా యూత్.. రీల్స్ చూస్తూ కొంతమంది రీల్స్ చేస్తూ కొంతమంది టైం ను వృధా చేసుకుంటున్నారు. ఇక రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. ఇప్పటికే చాలా మంది వీటి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రీల్స్ చేయడం వల్ల పాపులర్ అయినా వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఈ రీల్స్ వల్ల డబ్బులు సంపాదిస్తుంటే మరికొంతమంది సినిమాల్లో అవకాశాలు కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అలా వచ్చిన వారే ఉన్నారు. తమలోని టాలెండ్ ను బయటపెడుతూ కొందరు ఫేమస్ అవుతున్నారు. మరికొంతమంది కామెడీ వీడియోలతో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే రీల్స్ చేసే పిచ్చితో కొంతమంది చేసే పనులు ప్రమాదంతో పాటు అప్పుడప్పుడు నవ్వులు కూడా పూయిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఇద్దరు ఓ సినిమా సాంగ్ కు రీల్ చేస్తూ కనిపించారు. ఇద్దరూ టీనేజర్ ప్రభుదేవా సాంగ్ కు రిల్ చేస్తూ కనిపించారు. అయితే అదే సమయంలో వారి వెనక ఉన్న ఓ అబ్బాయి అమ్మాయి కూడా డాన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఆ యువకుడు అమ్మాయిని ఎత్తుకొని రౌండ్ తిరగాలని అనుకున్నాడు కానీ ఇంతలో మా అమ్మాయి ప్రమాదవశాత్తు అతని చేతిలో నుంచి పడిపోతుంది. అంతే అక్కడి నుంచి మెట్ల పై దొర్లుతూ కిందకు పడిపోతుంది. అది పట్టించుకోకుండా ఈ ముందున్న అమ్మాయి అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ముందున్న ఈ ఇద్దరి కంటే వెనకాల పడిపోయిన వారు వైరల్ అయ్యారు. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles