AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: నటాషాతో విడాకుల రూమర్లు.. ఎట్టకేలకు కుండ బద్దలు కొట్టిన హార్దిక్ పాండ్యా.. ఏమన్నాడంటే?

టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్ ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 రౌండ్‌లో టీమ్ ఇండియా చోటు దక్కించుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌లో అతనికి అవకాశం రావడం లేదు.

Hardik Pandya: నటాషాతో విడాకుల రూమర్లు.. ఎట్టకేలకు కుండ బద్దలు కొట్టిన హార్దిక్ పాండ్యా.. ఏమన్నాడంటే?
Hardik Pandya Family
Basha Shek
|

Updated on: Jun 13, 2024 | 10:04 PM

Share

టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్ ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 రౌండ్‌లో టీమ్ ఇండియా చోటు దక్కించుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌లో అతనికి అవకాశం రావడం లేదు. రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం వస్తే తప్పకుండా ధనా ధన్ బ్యాటింగ్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఓవరాల్ గా హార్దిక్ పాండ్యా టోర్నీలో బాగా సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈ టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఎంపిక చేసి కెప్టెన్సీని అప్పగించింది. దీంతో ముంబై అభిమానులు, రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పాండ్యా. దీనికి తోడు ఐపీఎల్ పోటీల్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా నిరాశపరిచింది. దీనిని మర్చిపోతుండగానే హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో తీవ్ర తుఫాన్ చెలరేగింది. హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. అయితే 15 రోజుల క్రితం నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. దీని తర్వాత, హార్దిక్ పాండ్యా మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేశాడు.

టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్, భారత్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. కానీ పాక్ జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆడుతున్న అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లను కలిశారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో వన్ టు వన్ అంటూ ముచ్చటించాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

  • హార్దిక్ పాండ్యా: రికీ..! అంతా ఎలా జరుగుతోంది? మీ కుటుంబం ఎలా ఉంది
  • రికీ పాంటింగ్: వాళ్లంతా కూల్‌గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు?
  • హార్దిక్ పాండ్యా: అంతా బాగానే ఉంది. ఆల్ స్వీట్

పై సంభాషణను బట్టి హార్దిక్, నటాషాల మధ్య అంతా బాగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ వీడియోను ఐసీసీ యూట్యూబ్‌లో ఎ డే ఇన్ లైఫ్ ఆఫ్ రికీ పాంటింగ్ పేరుతో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

హార్దిక్, రికీ పాంటింగ్ ల ముచ్చట్లు .. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..