T20 World Cup 2024: ఫ్లోరిడాను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. బిక్కు బిక్కుమంటోన్న పాక్ క్రికెట్ టీమ్
T20 ప్రపంచ కప్ 2024 లో హాట్ ఫేవరెట్ జట్టుగా టోర్నమెంట్‌లోకి అడుగు పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. అయితే ఇప్పుడు లీగ్ దశలోనే తన ప్రయాణాన్ని ముగించాల్సిన దుస్థితికి చేరుకుంది. తొలి రౌండ్‌లో గ్రూప్-ఎలో చోటు దక్కించుకున్న బాబర్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, రెండింట్లో ఓడిపోయింది.

T20 ప్రపంచ కప్ 2024 లో హాట్ ఫేవరెట్ జట్టుగా టోర్నమెంట్‌లోకి అడుగు పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. అయితే ఇప్పుడు లీగ్ దశలోనే తన ప్రయాణాన్ని ముగించాల్సిన దుస్థితికి చేరుకుంది. తొలి రౌండ్‌లో గ్రూప్-ఎలో చోటు దక్కించుకున్న బాబర్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, రెండింట్లో ఓడిపోయింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. అయితే, సూపర్ రౌండ్‌ను కైవసం చేసుకునేందుకు చివరి అవకాశం ఉన్న పాకిస్థాన్, తమ తదుపరి మ్యాచ్‌లో అంటే లీగ్ దశలో ఐర్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. ఇది కాకుండా, ఇతర జట్ల ఫలితం కూడా పాకిస్తాన్ జట్టు సూపర్ 8 రౌండ్ కలను నిర్ణయించనుంది. అయితే ఐర్లాండ్‌తో జరిగే ఈ కీలక మ్యాచ్ అనుమానమేనని, ఆ మ్యాచ్ ఆడకుండానే లీగ్ నుంచి ఔట్ కావడంపై కెప్టెన్ బాబర్ తెగ ఆందోళన పడుతున్నాడని సమాచారం. 2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లు ఫ్లోరిడాలో జరగాల్సి ఉంది. కెనడాతో టీమిండియా తదుపరి మ్యాచ్ ఇక్కడే జరగనుంది. భారత జట్టు ఇప్పటికే సూపర్ 8కి చేరుకోవడం, కెనడా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ ఫలితం కెనడాపై పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఇక్కడ జరగాల్సిన ఐర్లాండ్ వర్సెస్ అమెరికా, పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు చాలా కీలకం. ఫ్లోరిడాలో జరిగే ఈ రెండు మ్యాచ్‌లు సూపర్ 8 రౌండ్‌లోకి ప్రవేశించే మిగిలిన ఒక జట్టును నిర్ణయిస్తాయి. కానీ ఫ్లోరిడాలో తీవ్ర తుఫాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. భారత్, కెనడా మినహా మరేదైనా మ్యాచ్ వర్షం వల్ల ప్రభావితమైతే, పాకిస్థాన్‌కు సూపర్ 8 రౌండ్ కల చెదిరినట్టే.
🚨#BREAKING: A Life threatening flash flood emergency has been declared due to catastrophic flooding multiple water resources are underway
The National Weather Service in Miami has issued a Flash Flood Emergency for significant to catastrophic flooding in… pic.twitter.com/DS2NwM9Lwa
— R A W S A L E R T S (@rawsalerts) June 12, 2024
ఐర్లాండ్, అమెరికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. అంటే అమెరికాకు 5 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టు సులువుగా సూపర్ 8 రౌండ్‌కు దూసుకెళ్లనుంది. మరోవైపు పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌లో గెలిచినా గరిష్టంగా 4 పాయింట్లు మాత్రమే ఖాతాలో ఉంటాయి. ఒకవేళ వర్షం కారణంగా పాకిస్థాన్, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దైతే.. పాకిస్థాన్ కు ఒక్క పాయింట్ మాత్రమే దక్కుతుంది. దీంతో పాకిస్థాన్ జట్టు గరిష్టంగా 3 పాయింట్లను మాత్రమే కలిగి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ జట్టు సూపర్ 8 రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే, ఫ్లోరిడాలో టీమ్ ఇండియా మ్యాచ్ మినహా మిగిలిన రెండు మ్యాచ్ లు జరగాలని పాకిస్థాన్ జట్టు దేవుడిని ప్రార్థిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








