AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: నేలమట్టం కానున్న 250 కోట్ల న్యూయార్క్ స్టేడియం.. కూల్చివేత పనులు షురూ.. కారణమిదే

క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపని అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కారణంగా న్యూయార్క్‌లో నసావు కౌంటీ ఇంటర్నేషనల్ మాడ్యులర్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. దాదాపు 30 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 250 కోట్ల రూపాయలతో కేవలం 106 రోజుల్లోనే ఈ మాడ్యులర్ స్టేడియాన్ని నిర్మించారు.

T20 World Cup 2024: నేలమట్టం కానున్న 250 కోట్ల న్యూయార్క్ స్టేడియం.. కూల్చివేత పనులు షురూ.. కారణమిదే
New York Nassau County Stadium
Basha Shek
|

Updated on: Jun 13, 2024 | 5:24 PM

Share

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తన్నాయి. క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపని అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కారణంగా న్యూయార్క్‌లో నసావు కౌంటీ ఇంటర్నేషనల్ మాడ్యులర్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. దాదాపు 30 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 250 కోట్ల రూపాయలతో కేవలం 106 రోజుల్లోనే ఈ మాడ్యులర్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే కేవలం 8 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకే వినియోగించిన ఈ స్టేడియాన్ని ఇప్పుడు కూల్చివేస్తున్నారు. అమెరికాలో T20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, ICC ఈ ఏడాది జనవరిలో న్యూయార్క్‌లో 34,000 సీట్ల మాడ్యులర్ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టింది. అందుకు తగ్గట్టుగానే కేవలం 106 రోజుల్లోనే నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం పేరుతో కొత్త టెక్నాలజీతో కూడిన స్టేడియాన్ని నిర్మించారు.

సమయం లేకపోవడంతో..

ఈ మాడ్యులర్ స్టేడియం ప్రత్యేకత ఏమిటంటే డ్రాప్ ఇన్ పిచ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే ఈ స్టేడియం నిర్మాణంలో అల్యూమినియం, ఉక్కును ఎక్కువగా ఉపయోగించారు. ప్రధానంగా రెండు కారణాలతో ఈ మాడ్యులర్ స్టేడియాన్ని నిర్మించారు. సమయం లేకపోవడం అలాగే పర్యావరణ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మినహా క్రికెట్ టోర్నీలు చాలా తక్కువ. దీంతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఈ స్టేడియంను కూల్చివేయాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రారంభమైన కూల్చివేత పనులు..

ఈ స్టేడియంలో షెడ్యూల్ ప్రకారం మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ఈ స్టేడియం నిర్మాణం వెనుక ఉద్దేశ్యం ప్రకారం, ఇప్పుడు ఈ స్టేడియంను చదును చేసి, ఈ స్థలాన్ని తిరిగి పాత రూపంలోకి తీసుకువస్తున్నారు. 106 రోజుల్లో నిర్మించిన నాసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పుడు 6 వారాల గ్యాప్ లోనే కూల్చివేయనున్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఈ స్టేడియం కూల్చివేత పనులు భారతదేశం, అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ ముగిసన తర్వాతే ప్రారంభమయ్యాయి. ఇక స్టేడియం పిచ్‌ల విషయానికొస్తే, నాసావు కౌంటీ అధికారులు వాటిని వేరే చోటికి తరలించవచ్చునని తెలుస్తోంది.

కాగా ఈ మాడ్యులర్ స్టేడియం ముందుగా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) మ్యాచ్‌లను ఆడేందుకు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు MLC బేస్ న్యూయార్క్‌లో ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో అంబానీ కొత్త స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక స్టేడియం నిర్మాణంపై ఎంత చర్చ జరుగుతుందో, వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత కూడా స్టేడియం పిచ్‌లపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడానికి బ్యాటర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు కేవలం 108 పరుగులు మాత్రమే. అలాగే నిన్న అమెరికా ఇచ్చిన 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్ ఇండియా కూడా చెమటోడ్చాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..