Tollywood: ఈ ఫొటోలోని నటుడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో వంద కోట్ల హీరో.. యూత్‌లో పిచ్చ క్రేజ్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో సక్సెస్ అయిన వారిలో కొందరు. పైన ఫొటోలో ఉన్న యంగ్ హీరో కూడా ఈ కోవకే చెందుతాడు

Tollywood: ఈ ఫొటోలోని నటుడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో వంద కోట్ల హీరో.. యూత్‌లో పిచ్చ క్రేజ్
Tollywood Hero
Follow us

|

Updated on: Jun 13, 2024 | 9:39 PM

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో సక్సెస్ అయిన వారిలో కొందరు. పైన ఫొటోలో ఉన్న యంగ్ హీరో కూడా ఈ కోవకే చెందుతాడు. ఇతను సైడ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్‌గా, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కూడా చేశాడు. నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమంగా హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. కష్టేఫలి అన్న మాటను నిజం చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఎంతలా అంటే.. చాలామంది హీరోలకు సాధ్యం కాని వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో అంటే ఇతగాడి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. పైగా యూత్‌లోనూ ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ నటుడు మరెవరో కాదు ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరో సిద్దు జొన్నల గడ్డ.

పై ఫోటోలో కనిపిస్తున్న సిద్ధు లుక్ న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘భీమిలి కబడ్డి జట్టు’ సినిమాలోనిది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ నటించడన్నా విషయం కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ సినిమాలో సిద్ధు అక్కడక్కడా అది కూడా కబడీ పోటీలు జరిగే సీన్లలో మాత్రమే కనిపిస్తాడు. పైగా సినిమా అంతా నాని చుట్టు తిరుగుతుంది కాబట్టి సిద్ధుని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. సిద్ధూ హీరోగా పరిచయం కాకమందు పలు సినిమాల్లో నటించాడు. నాగ చైతన్య జోష్, భీమిలి కబడ్డీ జట్టు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, బాయ్ మీట్స్ గర్ల్, గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా తదితర చిత్రాల్లో నటించాడు. తర్వాత డీజే టిల్లు సినిమాతో హీరోగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు.ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతానికి సిద్ధు టిల్లు క్యూబ్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. అలాగే కొందరి స్టార్ హీరోల సినిమాల్లో కూడా సెకెండ్ హీరో రోల్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సిద్దూ జొన్నల గడ్డ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!