Pradeep K Vijayan: మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్.. ప్రముఖ కమెడియన్ అనుమానాస్పద మృతి.. కారణమదేనా?

తమిళ సినిమా చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్, విలన్ ప్రదీప్ కె విజయన్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) ఆయన విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుడు ఫోన్‌ చేస్తుండగా ఎటువంటి స్పందన రాలేదు.

Pradeep K Vijayan: మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్.. ప్రముఖ కమెడియన్ అనుమానాస్పద మృతి.. కారణమదేనా?
Pradeep K Vijayan
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2024 | 8:23 PM

తమిళ సినిమా చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్, విలన్ ప్రదీప్ కె విజయన్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) ఆయన విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుడు ఫోన్‌ చేస్తుండగా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్‌ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. అయితే ప్రదీప్ ఇంటికి లోపలి నుంచి తాళం వేసి ఉంది. విజయన్ గుండెపోటుతో మరణించాడా లేక దాడికి గురయ్యాడా అనేది ఖచ్చితంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంలో ప్రదీప్ కే విజయన్ నటించాడు. ఈ సినిమా శుక్రవారం (జూన్ 14) న రిలీజ్ కానుంది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు ప్రముఖులు విజయన్ మృతికి నివాళులు అర్పిన్నారు. మరోవైపు జూన్ 12న విజయన్ మరణించినట్లు సమాచారం.

ప్రదీప్ కే విజయన్ అనేక తమిళ సినిమాలలో హాస్య నటుడిగా, విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రదీప్ విజయన్‌ను తమిళ సినీ పరిశ్రమ ప్రజలు ‘పప్పు’ అని ముద్దుగా పిలుచుకుంటారు. విజయ్ సేతుపతి నటించిన ‘హే సినీమికా’, ‘తేగిడి’, ‘రుద్రన్’, ‘మహారాజా’ వంటి మరెన్నో సినిమాల్లో ప్రదీప్ విజయన్ కీలక పాత్రలు పోషించాడు. విజయన్ మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమకు చెందిన పపలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గాయని, నటి సౌందర్య నంద కుమార్ ట్వీట్ చేస్తూ, ‘ఈ వార్త షాకింగ్‌గా ఉంది. విజయన్ నాకు ప్రియమైన సోదరుడిలాంటివాడు. మేం రోజూ మాట్లాడుకోకపోయినా, ఎప్పుడూ ప్రేమతో, ఆత్మీయతతో మాట్లాడుకునేవాళ్లం’ అని ట్వీట్ చేశారు. విజయన్ మరణానికి సంబంధించి ఇంకా పూర్త వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల దిగ్భ్రాంతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే