- Telugu News Photo Gallery Cinema photos Director S.S Rajamouli and Mahesh Babu movie in Trending, details here
Mahesh Babu: ట్రెండింగ్ లో రాజమౌళి – మహేష్ బాబు సినిమా.. ఎందుకు అనుకుంటున్నారా.?
సింహం ఒక్కడుగు వెనక్కి వేసేది వందడుగులు ముందుకేసి దూసుకుపోవడానికే! అలాగే, ఇప్పుడు మహేష్ కెమెరాలకు దూరంగా ఉండేది... రేపటి నుంచి వెలుగుల మధ్య వుండటానికే అని అంటున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి అని ఒకింత విసుగును ప్రదర్శిస్తారనుకుంటే, జరుగుతున్న విషయాలను చిరునవ్వుతో చూస్తున్నారు ఘట్టమనేని సైన్యం. బాహుబలి, ట్రిపుల్ ఆర్.. సినిమా ఏదైనా జక్కన్న తీసే పద్ధతి, అయ్యే కాల్షీట్లను ఒక్కసారి గమనించిన వారు ఎవరైనా సరే..,
Updated on: Jun 13, 2024 | 9:45 PM

రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే.!

ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి అని ఒకింత విసుగును ప్రదర్శిస్తారనుకుంటే, జరుగుతున్న విషయాలను చిరునవ్వుతో చూస్తున్నారు ఘట్టమనేని సైన్యం. బాహుబలి, ట్రిపుల్ ఆర్.. సినిమా ఏదైనా జక్కన్న తీసే పద్ధతి, అయ్యే కాల్షీట్లను ఒక్కసారి గమనించిన వారు ఎవరైనా సరే,

నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ డ్యూరేషన్ మీద ఓ అంచనాకు వచ్చేస్తారు. రాజమౌళి కాంపౌండ్‌లోకి హీరో ఎంట్రీ ఇచ్చారంటేనే, కొన్నేళ్ల పాటు లాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు మహేష్‌దీ అదే పరిస్థితి. ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక లుక్ హైడ్ చేయాలి, సేమ్ లుక్‌ని మెయింటెయిన్ చేయాలి..

ఇలాంటి ఎన్నో ఆంక్షలుంటాయి. ఏమాత్రం ఫ్రీగా ఉన్నా బిఫోర్ షూటింగే కదా.. కొన్నాళ్ల పాటు మా సూపర్‌స్టార్ ఆ స్పేస్‌ని ఎంజాయ్ చేయడంలో తప్పేం లేదు.. అని కూల్‌గా ఉన్నారు ఘట్టమనేని సైన్యం.

ఫ్యాన్స్ కూల్‌గా ఉన్నంతమాత్రాన మహేష్ కూల్‌గా లేరు. జక్కన్న మూవీ కోసం ఆల్రెడీ వర్కవుట్ స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ లుక్ టెస్టులు చేస్తున్నారు.

మరోవైపు స్టోరీ డిస్కషన్స్ తో అప్‌డేట్ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ముందు ఆ మాత్రం హోమ్ వర్క్ చేయాలి కదా అన్నది మహేష్ నుంచి వినిపిస్తున్న మాట.




