AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొలిటికల్ హీట్ పెంచుతున్న పాల ప్యాకెట్లు.. ఈ పంచాయతీ అంతా దానికోసమేనా..!

వరంగల్ మహానగరంలో కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీ మధ్య పాల ప్యాకెట్ల పంచాయతీ నడుస్తోంది.. పాలాభిషేకాలు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. వరంగల్‌కు మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపనులు ఇప్పుడు క్రెడిట్ వరకు దారితీశాయి. పాల ప్యాకెట్లతో రోడ్డెక్కిన ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, పాలాభిషేకలతో జనంలో చర్చగా మారుతున్నారు..

Telangana: పొలిటికల్ హీట్ పెంచుతున్న పాల ప్యాకెట్లు.. ఈ పంచాయతీ అంతా దానికోసమేనా..!
Credit War Between Congress And Bjp
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 12:51 PM

Share

వరంగల్ మహానగరంలో కాంగ్రెస్ – భారతీయ జనతా పార్టీ మధ్య పాల ప్యాకెట్ల పంచాయతీ నడుస్తోంది.. పాలాభిషేకాలు పొలిటికల్ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. వరంగల్‌కు మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపనులు ఇప్పుడు క్రెడిట్ వరకు దారితీశాయి. పాల ప్యాకెట్లతో రోడ్డెక్కిన ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, పాలాభిషేకలతో జనంలో చర్చగా మారుతున్నారు. ఇంతకీ ఆ క్రెడిట్ ఎవరిది..? పాల ప్యాకెట్ల పంచాయతీకి కారణం ఏంటి..?

407.7చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 42 విలీన గ్రామాలను కలుపుకుని 66 డివిజన్లలో విస్తరించి ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. ప్రతిసారి ఎన్నికల సమయంలో రాజకీయ అస్త్రంగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కార్యరూపం దాల్చబోతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రకటనలు, పరస్పర విమర్శలకు దారితీసే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఎట్టకేలకు తొలిఅడుగు పడింది. పరిపాలనాపరమైన అనుమతి లభించింది.. నిధులు మంజూరు అయ్యాయి.. రూ.5,257 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయడానికి పరిపాలన పరమైన అనుమతులు లభించాయి.. రేపు మాపో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఘనత మాదంటే మాదంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటాపోటీగా సంబరాలు నిర్వహిస్తున్నాయి.

పాలాభిషేకాలతో జనంలో చర్చగా మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తే బీజేపీ శ్రేణులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ఆ ఘనత మాదే అంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మంజూరైన నిధులలో 25 శాతం కేంద్రం వాటా ఉందని బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాబిషేకాలు చేస్తున్నారు. ఈ పాలాభిషేకాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పాల ప్యాకెట్ల బ్యాచ్‌ను ప్రజలు నమ్మరని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్రెడిట్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే సొంతం అంటున్నారు.

త్వరలో GWMC ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఈ విధంగా క్రెడిట్ వారు జరుగుతుంది. ఆ క్రెడిట్ వార్ పాల ప్యాకెట్ల పంచాయతీకి దారితీసింది. పాల ప్యాకెట్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రెడిట్ వార్ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us