AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్ల కొరత.. గృహ అవసరాలకు తప్పని తిప్పలు.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే..

LPG Gas Cylinder: ఇప్పుడు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల హోటల్స్‌కు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది? అలాగే గ్యాస్ కొరత ఏర్పడినట్లయితే వ్యాపారం చేసుకోవడం కష్టంగా మారుతుందని హటల్‌ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరఫరాలో అంతరాయం 2 లక్షల మంది వినియోగదారులపై తీవ్ర..

LPG Gas: హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్ల కొరత.. గృహ అవసరాలకు తప్పని తిప్పలు.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే..
Gas Cylinder
Subhash Goud
|

Updated on: Mar 10, 2026 | 10:16 AM

Share

LPG Gas Cylinder: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా సంక్షోభం మధ్య ముంబై, బెంగళూరు, పంజాబ్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వాణిజ్య LPG వినియోగదారులు కొరతను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలోని రెస్టారెంట్లు తగినంత గ్యాస్‌ సిలిండర్లు లేకపోవడం వల్ల మూసివేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ను నివారించడానికి, సిలిండర్లను న్యాయబద్ధంగా అందించడానికి భారత ప్రభుత్వం ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్‌లోనూ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. ముందే ఇది రంజాన్‌ పండగ మాసం. దీంతో హోటల్స్‌ యజమానులు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా హోటళ్లను తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు గ్యాస్ లేకపోవడంతో హోటల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Multibagger: కేవలం 1 లక్ష రూపాయలే రూ.65 లక్షలుగా మారింది.. ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిన స్టాక్‌!

ఇప్పుడు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల హోటల్స్‌కు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది? అలాగే గ్యాస్ కొరత ఏర్పడినట్లయితే వ్యాపారం చేసుకోవడం కష్టంగా మారుతుందని హటల్‌ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరఫరాలో అంతరాయం 2 లక్షల మంది వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆన్‌లైన్‌లో, బ్లాక్‌లోనూ కమర్షియల్‌ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కమర్షియల్‌ గ్యాస్ మాత్రం కొరత ఉందని చెబుతున్నారు మరి కొందరు. 100 బుకింగ్‌లు ఉంటే కనీసం 10,20 కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

గృహ అవసరాలకు తప్పని గ్యాస్ తిప్పలు:

ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సమస్య ఇలా ఉంటే డొమెస్టిక్‌ సిలిండర్ల కొరత కూడా ఏర్పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ను బుక్ చేసుకున్న వారానికి కూడా రాని పరిస్థితి నెలకున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ కొరతపై వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు.

పుకార్లు నమ్మకండి:

ఇదిలా ఉంటే.. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. గ్యాస్ కొరత ఉందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు.డొమెస్టిక్‌ సిలిండర్ల కొరత లేదని హెచ్‌పీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ శ్రీనివాస్‌ టీవీ9 మీడియాకు తెలిపారు. గ్యాస్‌ సిలిండర్ వచ్చేందుకు వారం రోజులు పడుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఒక్క రోజులోనే సిలిండర్‌ను అందజేస్తున్నామని చెప్పారు. అలాగే ఇంటి యజమాని లేకుంటే మరో రోజునే అందిస్తున్నామని అన్నారు. గ్యాస్‌ కొరతపై వస్తున్న పుకార్లను వినియోగదారులు నమ్మి అందోళన చెందుతున్నారని, ఇటువంటివి ఏవి కూడా నమ్మవద్దని, మీకు ఒక రోజులోనే సిలిండర్‌ను అందజేస్తామని సూచించారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..

ఇది కూడా చదవండి: లీటరుకు 27.97 కి.మీ వరకు మైలేజ్.. ఈ SUVపై రూ. 1,00,000 వరకు తగ్గింపు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us