Nithiin: మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి నితిన్‌.? ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే..

ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్రహీరోలు ఈ వ్యాపారంలో దుమ్మురేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో యంగ్ హీరో నితిన్‌ సైతం మల్టీప్లెక్స్‌ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ యంగ్‌ హీరో ఏషియన్‌ సంస్థతో కలిసి...

Nithiin: మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి నితిన్‌.? ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే..
Nithin
Follow us

|

Updated on: Jun 17, 2024 | 7:36 AM

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు సినీ తారలు. మొన్నటి వరకు ఎక్కువగా హీరోయిన్లు మాత్రమే వ్యాపారాల్లోకి అడుగుపెట్టే వారు. కానీ ప్రస్తుతం హీరోలు సైతం వ్యాపారంలో తమదైన ముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే మెజారిటీ హీరోలు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ను ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్రహీరోలు ఈ వ్యాపారంలో దుమ్మురేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో యంగ్ హీరో నితిన్‌ సైతం మల్టీప్లెక్స్‌ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ యంగ్‌ హీరో ఏషియన్‌ సంస్థతో కలిసి ఏఎన్‌ఎస్‌ సినిమాస్‌ అనే మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.

నితిన్‌కు ఇంతకుముందే తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలో సితార పేరుతో ఓ థియేటర్‌ ఉంది. ప్రస్తుతం ఈ థియేటర్‌ను రేనోవేషన్‌ చేస్తున్నారు. అయితే ఇదే థియేటర్‌ను ఏషియన్‌ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్‌కు ఏషియన్‌ నితిన్‌ సితార అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మల్టీ ప్లెక్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందుబాటులోకి రానుంది.

మొన్నటి వరకు కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పట్టణాలకు మాత్రమే పరిమితమైన మల్టీప్లెక్స్‌ కల్చర్‌ హీరోల కారణంతో చిన్ని చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తోంది. కాగా ఇప్పటికే మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌లు మల్టీప్లెక్స్‌లను ప్రారంభించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మహేష్‌ బాబు ఏఎమ్‌బీ, విజయ్‌ దేవరకొండ మహబూబ్ నగర్‌లో AVD సినిమాస్‌, అల్లు అర్జున్ అమీర్‌పేట్లో ఏఏఏ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..