- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth, Vijay Sethupathi And Other Movie Celebrities Attend Aishwarya Arjun, Umapathy Reception, See Photos
Aishwarya Arjun: గ్రాండ్ గా అర్జున్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం తాజాగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.
Updated on: Jun 16, 2024 | 10:55 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం తాజాగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.

తాజాగా చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తమిళ రాజకీయ ప్రముఖులతో పాటుగా కోలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు.

సీఎం స్టాలిన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర రాజకీయ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇక సినీ ప్రముఖుల విషయానికి వస్తే..రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, స్నేహ రోజా, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు.

ప్రస్తుతం ఐశ్వర్య అర్జున్- ఉమాపతిల వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఐశ్వర్య, హీరో ఉమాపది ఇద్దరిది లవ్ మ్యారేజ్. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లికి పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.




