AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: ‘అందుకేనయ్యా దేవుడు నీ వెంటే ఉన్నాడు’.. యూట్యూబ్ ఛానెల్ ఆదాయాన్ని పంత్ ఏం చేస్తున్నాడో తెలుసా?

క్రికెట్ సంగతి పక్కన పెడితే.. రిషభ్ పంత్ చేసిన ఒక పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి తెలిసిన వారందరూ ఇప్పుడు పంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పంత్ గొప్ప మనసుకు నిదర్శనమంటూ తెగ కొనియాడుతున్నారు.

Rishabh Pant: 'అందుకేనయ్యా దేవుడు నీ వెంటే ఉన్నాడు'.. యూట్యూబ్ ఛానెల్ ఆదాయాన్ని పంత్ ఏం చేస్తున్నాడో తెలుసా?
Rishabh Pant
Basha Shek
|

Updated on: Jun 15, 2024 | 10:27 PM

Share

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ మ్యాచ్ లు గెలిచిన భారత జట్టు సూపర్-8 కు అర్హత సాధించింది. కాగా ఈ మెగా టోర్నీతోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్. ఐపీఎల్ ఆకట్టుకున్న ఈ డ్యాషింగ్ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. వికెట్ కీపింగ్ తో మెరుపు క్యాచ్ లు పడుతూనే, బ్యాటింగ్ లోనూ ధనా ధాన్ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి మొత్తం 96 పరుగులు చేశాడు పంత్.ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్​ లో 26 బంతుల్లోనే 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు పంత్. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 31 బంతుల్లో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక యూఎస్ఏపై 18 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కాగా క్రీజులో ఉన్నంత సేపు సిక్స్ లు, ఫోర్లు కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు పంత్. తద్వారా టీమిండియాకు భారీ స్కోరు అందేలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రికెట్ సంగతి పక్కన పెడితే.. రిషభ్ పంత్ చేసిన ఒక పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి తెలిసిన వారందరూ ఇప్పుడు పంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అదేంటంటే.. రిషభ్ పంత్ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌ ను ప్రారంభించాడు. తన పేరు మీద నడుస్తోన్న ఈ ఛానెల్ లో తనకు సంబంధించిన పలు వీడియోలను అప్ లోడ్ చేస్తున్నాడు. టీమిండియా ట్రైనింగ్ సెషన్స్ తో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధంచిన ఘటనలు, విషయాలను ఇందులో షేర్ చేసుకుంటున్నాడు. వీటికి తన అభిమానులు, ఫాలోవర్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. తాజాగా 100కే సబ్​స్క్రైబర్స్ దాటడంతో పంత్ యూట్యూబ్ ఛానెల్ కు సిల్వర్ బటన్‌ను ఇచ్చింది యూట్యూబ్. ఇదే సందర్భంగా పంత్ కీలక ప్రకటన చేశాడు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. యూట్యూబ్ ఆదాయానికి తన పర్సనల్ కాంట్రిబ్యూషన్ ను కలిపి మంచి పనుల కోసం వినియోగించనున్నట్లు పంత్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పంత్ గొప్ప మనసుకు ఇది నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు