AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs CAN: భారీ వర్షం ఎఫెక్ట్.. టాస్ పడకుండానే రద్దైన భారత్-కెనడా మ్యాచ్.. ఇక సూపర్-8 పోరు షురూ!

టీ 20 ప్రపంచకప్ లో వరుసగా రెండో రోజు క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. భారీ వర్షం కారణంగా టీమ్ ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

IND vs CAN: భారీ వర్షం ఎఫెక్ట్.. టాస్ పడకుండానే రద్దైన భారత్-కెనడా మ్యాచ్.. ఇక సూపర్-8 పోరు షురూ!
India Vs Canada Match
Basha Shek
|

Updated on: Jun 15, 2024 | 10:28 PM

Share

టీ 20 ప్రపంచకప్ లో వరుసగా రెండో రోజు క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. భారీ వర్షం కారణంగా టీమ్ ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. మ్యాచ్ రద్దుతో టీమ్ ఇండియా, కెనడా జట్లకు చెరొక పాయింట్ లభించింది. మ్యాచ్‌కు ముందు, USA vs Ireland మ్యాచ్ కూడా భారీ వర్షం కారణంగా రద్దయ్యింది . 24 గంటల్లో ఒకే మైదానంలో వరుసగా 2 మ్యాచ్‌లు రద్దు కావడంతో క్రికెట్ అభిమానుల్లో అసంతృప్తి, ఆగ్రహం నెలకొంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో టీమ్ ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ జరగాల్సి ఉంది.

రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు టాస్‌ వేయాలని నిర్ణయించారు. కానీ భారీ వర్షం కారణంగా పిచ్ తడిగా మారిపోయింది. 9 గంటల తర్వాత కూడా పిచ్ ఆరకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ రద్దు ప్రకటన వెలువడగానే ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అనంతరం కెనడా ఆటగాళ్లు భారత దిగ్గజాలతో ఫొటోలు దిగారు. కెనడా యువ ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో ఫోటో దిగారు. మరోవైపు మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు రిషబ్ పంత్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

కెనడా క్రికెట్ జట్టు: సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, శ్రేయాస్ మొవ్వా (వికెట్ కీపర్), డైలాన్ హెల్లిగర్, దిల్‌ప్రీత్ బజ్వా, రిషివ్ జోషి, జెరెమీ గోర్డాన్, జునైద్ సిద్ధిఖీ, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్గూర్, నవ్‌నీత్ సింగ్ ధాలీటన్, ప్రదేశ్ ఖ్వాల్ రవీంద్రపాల్ సింగ్, రాయంఖాన్ పఠాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి