AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee: ఆమె వల్లే నాకు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.. అసలు విషయం చెప్పిన తాప్సీ

తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమందినాదం సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ అమ్మడి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పైగా రాఘవేంద్రరావు సినిమా కావడంతో ఆమెను మరింత అందంగా చూపించారు. దాంతో కుర్రాళ్ళు తాప్సీకి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది

Taapsee: ఆమె వల్లే నాకు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.. అసలు విషయం చెప్పిన తాప్సీ
Taapsee
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2024 | 9:40 AM

Share

టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుకొని ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన భామలు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో తాప్సీ ఒకరు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమందినాదం సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ అమ్మడి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పైగా రాఘవేంద్రరావు సినిమా కావడంతో ఆమెను మరింత అందంగా చూపించారు. దాంతో కుర్రాళ్ళు తాప్సీకి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో మెరిసింది. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేసి హిట్ అందుకుంది. తెలుగులో ఈ సినిమా తర్వాత హిట్ అందుకోలేకపోయింది తాప్సీ. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది, ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది ఈ చిన్నది. బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది తాప్సీ. అంతే కాదు కంగనా రనౌత్ లాంటి ఫైర్ బ్రాండ్ తో మతాల యుద్దానికి దిగి వార్తల్లోనూ నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిన్నదాని దృష్టంతా బాలీవుడ్ సినిమాల పైనే ఉంది. కాగా తాజాగా తాప్సీ తనకు సినిమా అవకాశాలు రావడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తనకు వరుసగా అవకాశాలు రావడం పై తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను స్టార్ హీరోయిన్ ప్రీతీ జింటాకు లేటెస్ట్ వర్షన్ అని అంతా అనుకుంటున్నారు. అందుకే నాకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి. ప్రీతీ జింటా గురించి అందరికి తెలుసు. ఆమె చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. నేను బాలీవుడ్ లో ఉండటానికి కారణమైన ప్రీతీ జింటా పేరు చెడగొట్టేలా ఏదీ చేయను. ఆమె లానే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తా.. ప్రీతీ జింటా నేను సినిమాల్లోనే చూసాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే తాప్సీ ఇటీవలే ఆమె ప్రియుడు డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ను వివాహం చేసుకుంది వీరి పెళ్లి చాలా సీక్రెట్ గా జరిగింది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..