- Telugu News Photo Gallery Cinema photos Sachin Tendulkar daughter Sara Tendulkar wins everyones heart by spending time with poor children, see photos
Sara Tendulkar: అమ్మానాన్నల అడుగు జాడల్లో సారా టెండూల్కర్.. పేద పిల్లలతో కలిసి.. ఫొటోస్ వైరల్
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటోంది. అయితే గతంలో తన గ్లామరస్ ఫొటోలతో వార్తల్లో నిలిచిన సారా ఇప్పుడు ఒక మంచి పనితో అందరి హృదయాలను గెలుచుకుంది. తాజాగా సచిన్ కూతురు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలను చూసి అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated on: Jun 18, 2024 | 1:34 PM

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటోంది. అయితే గతంలో తన గ్లామరస్ ఫొటోలతో వార్తల్లో నిలిచిన సారా ఇప్పుడు ఒక మంచి పనితో అందరి హృదయాలను గెలుచుకుంది. తాజాగా సచిన్ కూతురు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

నెట్టింట వైరలవుతోన్న ఈ ఫొటోల్లో సారా టెండూల్కర్ పిల్లలకు బోధిస్తూ వారితో కబుర్లు చెబుతూ కనిపించింది. తల్లి అంజలి టెండూల్కర్ తో కలిసి పిల్లలతో సరదాగా ముచ్చటించింది.

పేద విద్యార్థులకు చదువు అందించడమే లక్ష్యంగా సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ పేరిట దేశంలో పలు ప్రాంతాల్లో విద్యాలయాలు ఏర్పాటుచేశారు.

సచిన్‌తో పాటు ఆయన భార్య అంజలి, కూతురు సారా, కొడుకు అర్జున్ కూడా తరచూ ఈ ఫౌండేషన్ సేవా కేంద్రాలను సందర్శిస్తుంటారు. పిల్లలతో గడుపుతుంటారు.

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సెహోర్ జిల్లాలోని నయాపురా, ఖాపా, బెల్పాటి, జముంజీల్, సెవానియా కాటేజీలను దత్తత తీసుకుంది. ఈ కాటేజీల్లో 3 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు విద్య, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు విద్యతో పాటు రోజుకు రెండుసార్లు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా STFలో భాగమైనందుకు ఎందుకు గర్వపడుతున్నాను' అని సారా ఎమోషనలైంది




