- Telugu News Photo Gallery Cinema photos Avika Gor Reveals Bitter Experience With Her Body Guard In A Event telugu cinema news
Avika Gor: వెనక వైపు అసభ్యంగా తాకాడు.. రెండుసార్లు అలాంటి పరిస్థితే.. అవికా గోర్..
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ సరసన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ కావడంతో లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, పాప్ కార్న్ చిత్రాలతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Jun 18, 2024 | 7:28 AM

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ సరసన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ కావడంతో లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, పాప్ కార్న్ చిత్రాలతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత వధువు అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో బ్లడీ ఇష్క్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా గోర్ ఓ ఈవెంట్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. అలా ఒక్కసారి కాకుండా రెండుసార్లు జరిగిందని తెలిపింది.

తాను వేదికపైకి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు అసభ్యంగా తాకాడని తెలిపింది. తిరిగి చూస్తే అక్కడ కేవలం తన బాడీగార్డ్ మాత్రమే ఉన్నారని.. అతడు సారీ చెప్పడంతో ఆ సంగతి వదిలేశానని తెలిపింది. ఇదే సంఘటన రెండోసారి కూడా జరిగిందని చెప్పుకొచ్చింది అవికా. కానీ ఈసారి తనను పట్టుకోకముందే బాడీగార్డ్ చేయి పట్టుకున్నాని అవికా తెలిపింది.

అతడి చేయి పట్టుకొని ఏం చేస్తున్నావ్ అని గట్టిగా నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని వెల్లిండించింది. దీంతో అతడిని వదిలిపెట్టాటనని.. అలాంటి వ్యక్తులను ఎదుర్కొవడానికి చాలా ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చింది. తనకే గనక అంత ధైర్యం ఉంటే ఇప్పటికే చాలా మందిని తిరిగి కొట్టేదానినని.. కానీ అది రాదని చెప్పుకొచ్చింది అవికా గోర్.

ఇన్నాళ్లు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన అవికా గోర్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ అనే సినిమాలో నటిస్తుంది. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో అడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్ చేసేందుకు కూడా అవికా రెడీగా ఉన్నట్లు సమాచారం.