- Telugu News Photo Gallery Cinema photos Bollywood makers are intereting to do movies with south indian heroins
నార్త్ సినిమాల బిజినెస్ కోసం సౌత్ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాలకు బిజినెస్ గట్టిగా జరగాలంటే సౌత్ టచ్ ఉండాల్సిందేనని నమ్ముతున్నారు మేకర్స్. అయితే హీరోలు, లేకుంటే విలన్లుగా మనవారిని అప్రోచ్ అవుతున్నారు. ఈ రెండు విషయాల సంగతి ఎలా ఉన్నా.. సౌత్ నుంచి గ్లామర్ టచ్ మాత్రం కోరుకుంటున్నారు... ఈ ట్రెండ్‌లో అవకాశాలు కొల్లగొట్టేస్తున్న మన హీరోయిన్లు ఎవరు? చూసేద్దాం రండి.... నేషనల్ క్రష్ రష్మికకు సినిమాల్లో నేషనల్ పర్మిట్ ఎప్పుడో వచ్చేసింది. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ క్లిక్ కావడంతో ఓవర్‌నైట్‌లో క్రేజ్ వచ్చేసింది.
Updated on: Jun 17, 2024 | 11:37 PM

నార్త్ సినిమాలకు బిజినెస్ గట్టిగా జరగాలంటే సౌత్ టచ్ ఉండాల్సిందేనని నమ్ముతున్నారు మేకర్స్. అయితే హీరోలు, లేకుంటే విలన్లుగా మనవారిని అప్రోచ్ అవుతున్నారు. ఈ రెండు విషయాల సంగతి ఎలా ఉన్నా.. సౌత్ నుంచి గ్లామర్ టచ్ మాత్రం కోరుకుంటున్నారు... ఈ ట్రెండ్‌లో అవకాశాలు కొల్లగొట్టేస్తున్న మన హీరోయిన్లు ఎవరు? చూసేద్దాం రండి....

నేషనల్ క్రష్ రష్మికకు సినిమాల్లో నేషనల్ పర్మిట్ ఎప్పుడో వచ్చేసింది. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ క్లిక్ కావడంతో ఓవర్‌నైట్‌లో క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు సల్మాన్‌తో సికిందర్ చేసినా, విక్కీ కౌశల్‌తో చావా చేసినా అదంతా ఈ క్రేజ్ చలవే. నార్త్ లో పూజా హెగ్డేకి సూపర్‌డూపర్ హిట్ అంటూ ఇప్పటిదాకా స్పెషల్‌గా ఏమీ లేకపోయినా, సౌత్‌లో ఆమెకున్న పేరును కన్సిడర్ చేస్తూ అవకాశాలు మాత్రం బాగానే ఇస్తున్నారు నార్త్ మేకర్స్.

సౌత్‌లో పక్కింటమ్మాయిగా రౌడీ బేబీ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న లేడీ పవర్‌స్టార్ సాయపల్లవి. నార్త్ ఇండస్ట్రీలో ఏకంగా ఒకటికి రెండు సినిమాలతో అడుగుపెడుతున్నారు. రామాయణం ఓ వైపు, అమీర్‌ఖాన్ కొడుకుతో చేస్తున్న సినిమా ఇంకో వైపు. రెండూ క్రేజీ ప్రాజెక్టులు కాబట్టి, ఈ భామ మరిన్ని సినిమాలకు సైన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు క్రిటిక్స్.

ప్రస్తుతం చేతిలో ఉన్న సౌత్ సినిమాలను త్వరగా కంప్లీట్ చేసుకుని, భవిష్యత్తు అంతా నార్త్ లోనే డిజైన్ చేసుకుంటారా? లేకుంటే అటూ ఇటూ బ్యాలన్స్ చేసుకుంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొత్త ప్లేస్‌కి చటుక్కున వెళ్లడానికి ఇష్టపడటం లేదు కీర్తిసురేష్.

2023లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్’ చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ఇది.




