- Telugu News Photo Gallery Cinema photos Ram charan comments about his father megastar chiranjeevi upcoming movies
Chiranjeevi: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కొడుకుల గురించి తండ్రులు చెబితే వినాలి. తండ్రుల గురించి పిల్లలు చెబితే వినాలి. జీవితంలో ఎవరి గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా...ఈ మాటల్లో ఉన్న ఇంటెన్సిటీ వేరబ్బా అని అంటున్నారు అబ్జర్వర్స్. లేటెస్ట్ గా చిరు గురించి చెర్రీ ఇచ్చిన లీక్స్ సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. భోళా శంకర్ టైమ్‌లో మిస్ అయిన సక్సెస్‌ని రెట్టింపు ఉత్సాహంతో పట్టుకుని తీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
Updated on: Jun 17, 2024 | 11:27 PM

ప్లానింగ్ అంటే విశ్వంభర.. విశ్వంభర అంటే ప్లానింగ్.. అందులో మాత్రం తగ్గేదే లే అంటున్నారు దర్శకుడు వశిష్ట. ఒక్క సినిమా అనుభవమే ఉన్నా.. షూటింగ్ విషయంలో మాత్రం 10 సినిమాల అనుభవం చూపిస్తున్నారు వశిష్ట.

భోళా శంకర్ టైమ్‌లో మిస్ అయిన సక్సెస్‌ని రెట్టింపు ఉత్సాహంతో పట్టుకుని తీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ బింబిసారతో ప్రూవ్ చేసుకున్న వశిష్ట చెప్పిన స్క్రిప్ట్ ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ కలిగించింది మరి.

200 కోట్ల సినిమాను ఈయన డీల్ చేస్తున్న విధానానికే అంతా ఫిదా అవుతున్నారు. అసలు విశ్వంభర అప్‌డేట్స్ ఏంటి..? ఇంకా షూట్ ఎంత బ్యాలెన్స్ ఉంది..? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు. మధ్యలో ఆచార్య అనుకున్నా.. జస్ట్ మిస్ అయిపోయింది ఈ జోడీ.

తన మనవరాలితో చిరుత అని పిలిపించుకుంటున్నారట చిరు. అందరికీ వయసు పెరుగుతుంటే, తన తండ్రికి మాత్రం వయసు తగ్గుతోందని అంటున్నారు చెర్రీ. ఇండస్ట్రీలో యంగ్‌స్టర్స్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడంలోనూ చిరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారని అంటున్నారు రామ్‌చరణ్.




