Yash: కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
ఒక విషయం కలిసొస్తే దాన్ని కంటిన్యూ చేయాలనే అనుకుంటుంది సినిమా ఇండస్ట్రీ. టోటల్ ఇండస్ట్రీ సంగతేమోగానీ, రాక్‌స్టార్ యష్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా దీనికే ఫిక్స్ అయిపోయారు. ఆయన రీసెంట్ మూవీస్‌నీ, నెక్స్ట్ సినిమాలను గట్టిగా గమనించిన వారికి ఈ విషయం ఇట్టే తెలుస్తుంది. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా అనుకున్నదే తడవుగా ఎదిగిన రాకీ భాయ్‌గా కేజీయఫ్‌లో మెప్పించారు యష్.
Updated on: Jun 17, 2024 | 11:13 PM

ఒక విషయం కలిసొస్తే దాన్ని కంటిన్యూ చేయాలనే అనుకుంటుంది సినిమా ఇండస్ట్రీ. టోటల్ ఇండస్ట్రీ సంగతేమోగానీ, రాక్‌స్టార్ యష్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా దీనికే ఫిక్స్ అయిపోయారు. ఆయన రీసెంట్ మూవీస్‌నీ, నెక్స్ట్ సినిమాలను గట్టిగా గమనించిన వారికి ఈ విషయం ఇట్టే తెలుస్తుంది.

Yash (2)ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా అనుకున్నదే తడవుగా ఎదిగిన రాకీ భాయ్‌గా కేజీయఫ్‌లో మెప్పించారు యష్. కేజీయఫ్ ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టుకి అదే యుఎస్‌పీ. ఈ సినిమాల థర్డ్ పార్టు కూడా ఇదే జోనర్‌లో ఉంటుంది. కేజీయఫ్2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు యష్.

యష్ హీరోగా ఆల్రెడీ టాక్సిక్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు 150 రోజుల పాటు లండన్‌లో జరుగుతుంది. యష్ ఈ మూవీలో స్టైలిష్ డాన్ రోల్ చేస్తున్నారు.

ఈ మూవీలో యష్‌కి సిస్టర్ రోల్ చేస్తున్నారు నయనతార. ముందు ఈ రోల్ కోసం కరీనా కపూర్‌ని అనుకున్నారు. అయితే ఆమె కాల్షీట్ కుదరకపోవడంతో నయన్‌కి ఫిక్స్ అయ్యారు.

రీసెంట్ టైమ్స్ లో స్టోరీ, అందులో తన కేరక్టర్ బావుంటే సిస్టర్ రోల్స్ కి కూడా ఓకే చెబుతున్నారు నయన్. గాడ్‌ఫాదర్‌లోనూ చిరు చెల్లెలిగా నటించారు. ఇప్పుడు యష్ టాక్సిక్‌కి ఓకే చెప్పారంటే, కేరక్టర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అనే ఊహాగానాలూ మొదలయ్యాయి.




