Allu arjun: పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 రిలీజ్ డేట్ గురించి ఎక్కడ ఎన్ని రకాల అనుమానాలున్నా, వాటన్నిటికీ ఒకే ఒక్క ట్వీట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేసింది టీమ్. పుష్ప సీక్వెల్ విషయంలో వచ్చినట్టే... మరో విషయంలోనూ క్లారిటీ ఇస్తే బావుంటుందంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏమిటా విషయం అనుకుంటున్నారా? అదేనండీ అట్లీ, త్రివిక్రమ్, సందీప్‌తో ముడిపడిన విషయం... ఏంటీ... మీకు అర్థమైనట్టేనా? ఏవంటారు...!
Updated on: Jun 17, 2024 | 10:48 PM

స్టైలిష్ హీరో ఇప్పుడున్న జోరు చూస్తుంటే అసలు తగ్గడం గురించి ఎవరైనా ఎందుకు ఊహిస్తారు చెప్పండి? అసలే పుష్ప మూవీతో నేషనల్ లెవల్ అప్రిషియేషన్ అందుకున్నారు బన్నీ.

జవాన్ సినిమాకు వెయ్యికోట్లకు పైగా బాక్సాఫీస్‌ని కొల్లగొట్టేశారు అట్లీ. నార్త్ లో ఈ కెప్టెన్ గురించి ఆరా తీసేవారు ఎక్కువయ్యారు. అయితే సేమ్ టైమ్.. అట్లీ మాత్రం ఐకాన్ స్టార్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. పుష్ప సీక్వెల్ తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అట్లీతోనే అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ కాంబో మీద రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్ సెట్స్ లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది

సినిమా మీద హైప్ రావడానికి జస్ట్ ఒక్కటంటే ఒక్క మాట చాలు. అలాంటి మాటలు అధికారికంగా వచ్చినా, లీక్ అయినా కిక్ ఇంకో రకంగా ఉంటుంది.

ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేస్తున్నారు ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్. అసలు తగ్గేదేలే అనే పదానికి పేటెంట్ హక్కు తీసుకుందామని అభిమాన స్టార్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు.

అట్లీ, త్రివిక్రమ్ సినిమాల మీద ఓ క్లారిటీ వచ్చాకనే సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారు ఐకాన్‌స్టార్. ప్రస్తుతం డార్లింగ్ స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప నుల్లో బిజీగా ఉన్న సందీప్, నెక్స్ట్ యానిమల్ పార్క్ వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. అంతలో బన్నీ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే... వీరిద్దరి కాంబో సెట్స్ మీదకు వెళ్లడానికి కాల్షీట్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నది క్రిటిక్స్ మాట.




