Athidhi Movie: హుర్రే.. మెంటల్ ఎక్కాల్సిందే.. అతిథి హిరోయిన్ లేటెస్ట్ లుక్ చూశారా..?

మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించగా.. స్టోరీ పెద్దగా జనాలకు కనెక్ట్ కాలేకపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు కథానాయికగా నటించింది. కంటెంట్ పరంగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది.

Athidhi Movie: హుర్రే.. మెంటల్ ఎక్కాల్సిందే.. అతిథి హిరోయిన్ లేటెస్ట్ లుక్ చూశారా..?
Athidi Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2024 | 10:21 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు. కానీ ఒకానొక టైమ్ లో మహేష్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మహేష్ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఆ మూవీస్ మ్యూజిక్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అందులో మ్యూజికల్ గా మెప్పించిన సినిమా అతిథి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించగా.. స్టోరీ పెద్దగా జనాలకు కనెక్ట్ కాలేకపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు కథానాయికగా నటించింది. కంటెంట్ పరంగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది.

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో మహేష్ సరసన నటించిన అమృతారావు తెలుగు అడియన్స్ కు దగ్గరయ్యింది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆర్జే ఆన్మోల్ తో ప్రేమలో పడింది. 2016లో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అమృతా రావు… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన ఫ్యామిలీ వీడియోస్ షేర్ చేస్తుంది. అలాగే తన భర్తకు సంబంధించిన ఫన్నీ వీడియోస్, రీల్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. గతంలో అమృతా రావు స్వయంగా ఓ పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకంలో తన అనుభవాలను పంచుకుంది. అందులో తన మేనేజర్ కారణంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మిస్ చేసుకుందట. హిందీలో సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమా ఛాన్స్ మిస్ అయినట్లుగా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. అమృతా రావు ఇన్ స్టా వీడియోస్ ఇప్పుడు నెట్టిటం వైరల్ గా మారాయి. ఇందులో అమృతా లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.