Chandra Yoga: చంద్రుడితో వారికి అధికార, అదృష్ట యోగాలు..! ఇందులో మీ రాశి ఉందా?
మార్చి 12, 13, 14 తేదీల్లో చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల గజకేసరి యోగం సహా మహా భాగ్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి వంటి ప్రయత్నాల్లో విజయాలు లభిస్తాయి. అలాగే ముఖ్య నిర్ణయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది.

Chandra Yoga
ఈ నెల(మార్చి) 12, 13, 14 తేదీలు కొన్ని రాశుల వారికి తిరుగులేని యోగాలనివ్వబోతున్నాయి. ఈ మూడు రోజుల్లో చంద్రుడు ధనూ రాశిలో సంచారం చేయడంతో పాటు, గురువుకు, ఉచ్ఛ శుక్రుడికి కేంద్ర స్థానాల్లో సంచారం చేయడం వల్ల మహా భాగ్య యోగాలు, అధికార యోగాలు పట్టబోతున్నాయి. చంద్రుడు గురువుతో సమ సప్తకం కావడం వల్ల గజకేసరి యోగమనే అదృష్ట యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రోజులు ఎటువంటి ప్రయత్నాలు ప్రారంభించినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ చంద్ర యోగాల వల్ల విశేషంగా లాభాలు పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర, గురు గ్రహాలు పరస్పరం చూసుకోవడంతో పాటు, చంద్రుడికి చతు ర్థంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి సప్తమంలో చంద్రుడికి గజకేసరి యోగం, ఉచ్ఛ శుక్రుడితో కేంద్ర స్థితి కలగడం వల్ల రాజ పూజ్యాలు లభిస్తాయి. సర్వత్రా ఈ రాశివారి ప్రాభవం పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి రెండు శుభ గ్రహాలు కేంద్ర స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. ఉన్నత పదవి కోసం ఇతర సంస్థలకు మారే అవకాశం కూడా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి.
- కన్య: ఈ రాశికి దశమ, సప్తమ కేంద్రాల్లో చంద్రుడికి రెండు మహా యోగాలు కలగడం వల్ల అన్ని విధాలుగానూ అదృష్టాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
- ధనుస్సు: ఈ రాశిలో ఉన్న చంద్రుడికి కేంద్రంలో ఉచ్ఛ శుక్రుడు, రాశ్యధిపతి గురువు సంచారం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, చంద్రుల సమ సప్తకం వల్ల గజకేసరి యోగం కలగడం, కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వృత్తి, వ్యాపారాల్లో కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
Follow Us