AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి వింత.. ఈ ముల్లంగి ఆకారం చూస్తే వావ్ అనాల్సిందే..!

ప్రకృతిలోనూ వివిధ రకాల వింతలు కనిపిస్తూ ఉంటాయి. రెండు తలలతో దూడలు, ఆవులు గేదెలు మేకలకు విచిత్ర ఆకారంలో పిల్లలు జన్మిస్తూ ఉంటాయి. పంటలలోను.. కూరగాయలు ఒక్కోసారి విభిన్న ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే.. అల్లూరి జిల్లాలో ఓ రైతు పొలంలో శివుడి ఆయుధమైన..

ప్రకృతి వింత.. ఈ ముల్లంగి ఆకారం చూస్తే వావ్ అనాల్సిందే..!
Trishul Shaped Radish
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 4:37 PM

Share

అరకులోయ, మార్చి 6: సృష్టిలో అనేక రకాల వింతలు, విచిత్రాలు జరుగుతాయి. ప్రకృతిలోనూ వివిధ రకాల వింతలు కనిపిస్తూ ఉంటాయి. రెండు తలలతో దూడలు, ఆవులు గేదెలు మేకలకు విచిత్ర ఆకారంలో పిల్లలు జన్మిస్తూ ఉంటాయి. పంటలలోను.. కూరగాయలు ఒక్కోసారి విభిన్న ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే.. అల్లూరి జిల్లాలో ఓ రైతు పొలంలో శివుడి ఆయుధమైన త్రిశూలం ఆకారం కనిపించింది. రైతు వేసిన ముల్లంగి తోట పంట చేతికి రావడంతో.. పొలానికి వెళ్లిన ఆ రైతు ముల్లంగి పంటను తీశాడు. దీంతో ఓచోట.. ముల్లంగి మొక్క పైకి లాగితే నా దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒకే మొక్క మొదలులో మూడు ముల్లంగిలో ఉండడం… అవి కూడా త్రిశూలం ఆకారంలో అతుక్కుని కనిపించడం తో ఉబ్బితబిబ్బయ్యాడు.

అల్లూరి జిల్లా అరకులోయ మండలం చినలబుడు పంచాయితీ మాలివలసలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. జోయో అనే రైతు.. తన పొలంలో ముల్లంగి తోట వేశాడు. ముల్లంగి పంటలు తీస్తున్న క్రమంలో.. త్రిశూలం ఆకారంలో అరుదైన రూపంతో దుంపలు కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు.. వంట చేస్తున్న సమయంలో అక్కడక్కడ ఇటువంటి దుంపలు బయటపడ్డాయి. శివుడు త్రిశూలం రూపంలో ముల్లంగి దుంపలు పడడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు. ఆ ముల్లంగి విషయం ఆ నోట ఈ నోట పాకడంతో.. వాటిని చూసేందుకు జనం తరలివచ్చారు. త్రిశూలం ముల్లంగి ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us