నల్లిబొక్కల పులుసు.. ఇలా వండి తింటే.. నరాలు జివ్వుమనాల్సిందే

Prasanna Yadla

06 March 2026

Pic credit - Pixabay

నల్లి బొక్కల పులుసు కుక్కర్‌లో చేసుకుంటే టేస్ట్ అదిరిపోతోంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. 

నల్లి బొక్కల పులుసు

అర కిలో మటన్ బోన్స్, చిన్న ఉల్లిపాయలు 2, పండు టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు

పసుపు, ఒక టేబుల్ స్పూన్  ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, నూనె, రుచికి తగినంత ఉప్పు , అర కట్ట కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు 

ముందుగా మటన్ బోన్స్ ను ఒక గిన్నెలో తీసుకుని ఉప్పుతో కడిగి శుభ్ర పరిచి పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ - 1

ప్రెజర్ కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి  రంగు మారే వరకు బాగా  వేయించాలి.

స్టెప్ - 2

ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి, కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. 

స్టెప్ - 3

ముందుగా పక్కన పెట్టిన మటన్ బోన్స్, అర టీ స్పూన్ పసుపు, కారం, ఒక టీ స్పూన్ మాసాలా పొడి వేసి 10 నిమిషాల పాటు వేయించాలి.

స్టెప్ - 4

ఇప్పుడు మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు నల్లి బొక్కలను బాగా ఉడికించాలి. చివర్లో  కొత్తిమీర వేసి దించేయండి.

స్టెప్ - 5