AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: చైతూ ఇలాగే సాగిపోతే ఈ లోకమే నీదవ్వదా..?

అక్కినేని నాగచైతన్య మరోసారి తన వినయంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. ‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను తానే అడిగి చేశానని.. చైతూ ఓపెన్‌గా చెప్పడం వైరల్ అవుతోంది. రెండు అగ్ర సినీ కుటుంబాల వారసత్వం ఉన్నప్పటికీ అహంకారం లేకుండా మాట్లాడిన అతని వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Naga Chaitanya: చైతూ ఇలాగే సాగిపోతే ఈ లోకమే నీదవ్వదా..?
Naga Chaitanya
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2026 | 4:58 PM

Share

అక్కినేని నాగచైతన్య.. గుర్తు పెట్టుకోండి ఈ పేరు చానా ఏళ్లు యాదుంటుంది. అతను తెలుగు ఇండస్ట్రీలో టాప్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఇటు అక్కినేని వారసత్వంతో పాటు అటు తన అమ్మగారి తరుపు నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ ఆశీస్సులు ఉన్నాయి. 17 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని అగ్ర హీరోగా తెలుగునాట కొనసాగుతున్నాడు. అయితే చైతన్య వ్యక్తిత్వం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా అతను వణకలేదు.. తొణకలేదు. అంతేకాదు.. ఆయన ఎక్కడికి వెళ్లినా హంగు ఆర్భాటం ఉండదు. ఒక సాధారణ వ్యక్తిలాగానే ప్రవర్తిస్తారు. ఇంత బ్యాగ్రౌండ్, ఫేమ్, సెలబ్రెటీ స్టేటస్ ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం చాలా అరుదు. గొప్పలకు పోయే మనస్తత్వం కాదు చైతూది. ఎదిగికొద్దీ ఒదుగుతూ.. నటుడిగా, ఒక వ్యక్తిగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ అక్కినేని హీరో. సోషల్ మీడియాలో కూడా రేర్‌గా కనిపిస్తూ ఉంటారు. కెరీర్ ప్రారంభంలో అయితే మెయిన్ స్ట్రీమ్‌ మీడియాకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు.  చైతన్య వ్యక్తిత్వం ఎలాంటిదో మీకు తాజా ఘటనను ఉదాహారణగా చెప్పాలి.

తాజాగా ‘వృషకర్మ’ అనే మూవీ చేస్తున్నాడు చైతూ. మిథికల్ ఫాంటసీ అండ్ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో హీరో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘తండేల్’ చిత్ర షూటింగ్ సమయంలోనే ‘వృషకర్మ’ కథ గురించి తెలిసిందని.. దర్శకుడు కార్తీక్ దండును, నిర్మాతను కలిసి ఈ ప్రాజెక్ట్ తానే చేస్తానని అడిగినట్లు చైతన్య తెలిపారు. వారు  మళ్లీ చెబుతామన్నారని.. ఆ తర్వాత కొంతకాలానికి తనతో ప్రాజెక్ట్ ఫైనల్ చేసినట్లు వివరించారు. తనను హీరోగా ఎంపిక చేసిందుకు, నమ్మినందుకు దర్శకుడికి, నిర్మాతకు థ్యాంక్స్ చెప్పారు.

ఒక్కసారి ఆలోచించండి.. తెలుగులో హీరోలను డెమీ గాడ్స్‌గా అభిమానులు భావిస్తారు. సహజంగానే చాలామందిలో దాని తాలూకా ఫ్రౌడ్‌నెస్ ఉంటుంది. నిజంగా అడిగి ప్రాజెక్ట్‌లోకి ఎంటరయిన.. ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాహాటంగా చెప్పరు. కానీ చైతూ ప్రెస్ మీట్‌లో అందరి ముందు, కెమెరాల ముందు ఈ విషయాన్ని చెప్పి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఎంత ఎదిగినా నేల విడిచి సాము చేయకూడదు అన్న సామెతకు చైతూ ఫర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. కొంతమంది అత్యంత దిగువ స్థాయి నుంచి ఎదిగి.. కాస్త హోదా, డబ్బు, ఫేమ్ రాగానే.. ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ సినీ ప్రపంచంలో రెండు అగ్ర కుటుంబాల వారసత్వాన్ని పంచుకుని పుట్టిన చైతూ ఈ నడవడిక.. అతనికి మరింత సక్సెస్‌ను, హుందాతనాన్ని ఇస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

‘వృషకర్మ’ చిత్రంలో ‘ట్రెజర్ హంటర్’పాత్రలో కనిపించనున్నారు ఈ అక్కినేని హీరో. ఇక తన 25వ సినిమా వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow Us
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!
మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్
మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు