కెనడాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే ఆమె, ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని తీవ్రంగా విమర్శించేవారు. లాసెల్లెలో గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి పారిపోగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖలిస్తానీ ఉగ్రవాదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.