Team India: ఓరే బాబు.. మాకొద్దు ఈ టార్చర్.. గంభీర్ ఎలాగు తీసేయ్యడు.. ఫైనల్ నుంచి నువ్వే తప్పుకో..!
Abhishek Sharma Trolled After Failure: టీమిండియా యంగ్ ప్లేయర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026లో దారుణంగా విఫలమతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్ నుంచి తీసేయాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Abhishek Sharma Trolled After Failure: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి నిరాశపరిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈసారి అతన్ని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (Will Jacks) ఔట్ చేశాడు.
సోషల్ మీడియాలో అభిమానుల ట్రోలింగ్..
అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ సెమీఫైనల్ ఇన్నింగ్స్‌తో కలిపి అతను ఆడిన 7 మ్యాచ్‌లలో 6 సార్లు 15 పరుగుల లోపే అవుట్ అయ్యాడు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. కొంతమంది అతన్ని “Blind Slogger” అంటూ విమర్శించారు. మరికొందరు అతని షాట్ సెలక్షన్‌పై ప్రశ్నలు లేవనెత్తారు.
సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్..
They are playing a blind slogger like Abhishek Sharma ahead of players like Ruturaj Gaikwad and Yashasvi Jaiswal.
Can’t believe this. 💔 pic.twitter.com/RCViAvpdLK
— Abhishek Kumar (@Abhishek060722) March 5, 2026
అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుతంగా ముందుకు నడిపించాడు. శాంసన్ కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై దాడి చేశాడు.
If any day god gives a second chance utilise like Sanju Samson but not like Abhishek Sharma #WorldCupSemis #INDvsENG #T20WorldCup
— Praveen Kumar G (@PraveenKum44266) March 5, 2026
అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) 18 బంతుల్లో 39 పరుగులు చేయగా, శివం దుబే (Shivam Dube) కీలక భాగస్వామ్యంతో భారత్ 10 ఓవర్లలోనే 119/2 స్కోర్ నమోదు చేసింది.
ఆర్చర్‌పై శాంసన్ దాడి..
Why Abhishek Sharma is still in the team? So it’s like you play one good match and then can play 10 bad matches and still be in team? Perform or perish. The rule should be Simple. @BCCI @GautamGambhir
— Biplab Debbarma, CFA (@Biplab_Debbarma) March 5, 2026
శాంసన్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) పై భారీ షాట్లు ఆడాడు. అతను ఆర్చర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, పలు బౌండరీలు కొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) మిడ్-ఆన్ వద్ద ఒక సులభమైన క్యాచ్ వదిలేయడంతో శాంసన్ కు మరో అవకాశం దక్కింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్..
This is how you should bat responsibly, Abhishek Sharma: focus on rotating the strike and mixing in power-hitting shots, exactly the way Sanju Samson and Ishan Kishan are playing right now. #INDvENG #SanjuSamson #AbhishekSharma #IshanKishan #T20WorldCup2026
— Rushabh Shah (@beingrushabh07) March 5, 2026
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రుక్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపిస్తూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
