AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. అలాగే నటుడిగానూ, మ్యూజిక్ డైరెక్టర్ గానూ అలరించారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తన ఓ ఇంటర్వ్యూలో సినిమా పట్ల తన ప్రత్యేక దృక్పథాన్ని, నేటి సినిమా ట్రెండ్స్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు

Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
Director Sv Krishna Reddy
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2026 | 10:02 PM

Share

దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాపై తన విశిష్టమైన ఆలోచనలను, ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పోకడలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కృష్ణారెడ్డి క్లెన్సెడ్ ఫిల్మ్స్ అనే తన నూతన బ్యానర్‌ను పరిచయం చేసినట్లు తెలిపారు. దీని అర్థం శుద్ధి చేయబడిన చిత్రాలు అని అన్నారు. గతంలో మనీషా ఫిల్మ్స్ పేరుతో సినిమాలు నిర్మించిన ఆయన, ఇప్పుడు కేవలం క్లీన్, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలనే నిర్మిస్తానని స్పష్టం చేశారు. నేటి సినిమాల్లో సర్వసాధారణమైన అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, యు/ఎ సర్టిఫికేట్ పొందిన చిత్రాల్లో సైతం అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

ఒక ఫిల్మ్‌మేకర్‌గా, ఆయన సినిమాను చూసే విధానం ఇతరులకంటే భిన్నంగా ఉంటుందని వివరించారు. తన సినిమాల్లో అబ్సర్డిటీ (అసంబద్ధత) లేదా డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఉండవని ఆయన స్పష్టం చేశారు. నటీమణుల దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని, అనుకోకుండా పైట చెంగు తొలగినా, నేరుగా ఆర్టిస్టుకు చెప్పకుండా కో-డైరెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సరిచేయిస్తానని తెలిపారు. ఇలాంటి క్లీన్ సినిమా దృక్పథంతోనే తాను కొనసాగుతానని కృష్ణారెడ్డి చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

గత పదేళ్లుగా వచ్చిన అనేక పెద్ద, చిన్న చిత్రాలను చూసిన తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఏదో ఒక సినిమా చాలా బాగుందని విని థియేటర్‌కు వెళ్లగా, ఇంటర్వెల్ సమయానికే సినిమా నచ్చక బయటకు వచ్చేశానని తెలిపారు. ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో స్క్రీన్‌ప్లే ప్రాముఖ్యతను కృష్ణారెడ్డి వివరించారు. సినిమా ప్రారంభమైన మొదటి నాలుగు నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలో లీనం కావాలని, అలా కుదరకపోతే ఏడు నిమిషాల్లోపలైనా ఆకట్టుకోవాలని చెప్పారు. లేకపోతే ప్రేక్షకుడు ఆసక్తి కోల్పోతాడని, అది మంచి సినిమాకు లక్షణం కాదని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లో
క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకపోతే అప్పుల్లో
స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్..
స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా పెద్ది మూవీ టీమ్..
ఇది పండు కాదు అమృతఫలం.. రోజుకొకటి తింటే ఆస్పత్రి బిల్లు ఆదా..
ఇది పండు కాదు అమృతఫలం.. రోజుకొకటి తింటే ఆస్పత్రి బిల్లు ఆదా..
డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్
డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్
అల్లాన్ని కూరల్లో వేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యకండి?
అల్లాన్ని కూరల్లో వేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యకండి?
రూ. 300కి కొన్నాడు.. ఏకంగా రూ. 634 కోట్లకు అమ్మాడు
రూ. 300కి కొన్నాడు.. ఏకంగా రూ. 634 కోట్లకు అమ్మాడు