చేసింది ఒక్క సినిమానే.. కట్ చేస్తే.. చిరంజీవి సినిమాలో ఛాన్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

14 February 2026

మలయాళీ చిత్రపరిశ్రమలో తోపు హీరోయిన్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా మంచి ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ వయ్యారి.

ఇటీవల శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.

తనే అనస్వర రాజన్. ఛాంపియన్ తర్వాత ఈ అమ్మడు మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. అదే చిరంజీవి సినిమాలో కనిపించనుందట ఈ బ్యూటీ. 

 ఇటీవలే సంక్రాంతి పండక్కి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు.. అటు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.

 మరోవైపు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో ఓ భారీ యాక్షన్ డ్రామా రాబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్.

అయితే ఈ  సినిమాలో చిరుకు కూతురుగా అనస్వర రాజన్ ను ఎంపిక చేసినట్లుగా టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవలే ఛాంపియన్ సినిమాతోపాటు విత్ లవ్ మూవీతో హిట్టు అందుకుంది. దీంతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అనస్వర రాజన్ పేరు మారుమోగుతుంది.