T20 World Cup 2024: కూల్ గా ఉండే ద్రవిడ్‌కు కోపం తెప్పించిన రిపోర్టర్.. ఏకంగా ఆ ప్రశ్న అడగడంతో..

టీ20 ప్రపంచకప్ లో భాంగా గురువారం (జూన్ 20) భారత్ , ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి . బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే మ్యాచ్‌కు ముందు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ ద్రవిడ్ మండిపడ్డారు.

T20 World Cup 2024: కూల్ గా ఉండే ద్రవిడ్‌కు కోపం తెప్పించిన రిపోర్టర్.. ఏకంగా ఆ ప్రశ్న అడగడంతో..
Rahul Dravid
Follow us
Basha Shek

|

Updated on: Jun 20, 2024 | 1:19 PM

టీ20 ప్రపంచకప్ లో భాంగా గురువారం (జూన్ 20) భారత్ , ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి . బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే మ్యాచ్‌కు ముందు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ ద్రవిడ్ మండిపడ్డారు. ఎప్పుడూ కూల్ గా, ఎంతో ఓపికగా కనిపించే ద్రవిడ్.. 27 ఏళ్ల క్రితం ఓటమిని గుర్తు చేయడంతో కాస్త సహనం కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. 1997లో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ గ్రౌండ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ఇదే మైదానంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఓ రిపోర్టర్ పాత పరాజయాన్ని ద్రవిడ్ కు గుర్తు చేశాడు.

  • రిపోర్టర్: “రాహుల్, ఆటగాడిగా, మీరు ఇక్కడ ఆడారు. మీకు 97 టెస్టు గుర్తుందా?
  • ద్రవిడ్: ”చాలా ధన్యవాదాలు మిత్రమా! నాకు ఇక్కడ మరికొన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ”
  • రిపోర్టర్: “నిజానికి నేను అదే అడగాలని అనుకున్నాను.. ఇక్కడ మంచి మెమొరీస్‌ కోసం ఆఫ్ఘాన్‌తో ఏం చేయాలనుకుంటున్నారు అని?”
  • ద్రవిడ్: “దేవుడా! నేనేమీ కొత్తగా చేయాలని ప్రయత్నించడం లేదు!

“నేను కొన్ని విషయాలను త్వరగా అధిగమించాను. అది నా లక్షణాలలో ఒకటి. ఆ తర్వాత ఆ విషయాలు వెనుదిరిగి చూడను. నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను, నేను ఏమి ప్రయత్నించగలను అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. 1997లో కానీ, ఆ తర్వాత కానీ ఏం జరిగినా పట్టించుకోను’ అని రాహుల్ ద్రవిడ్ ఘాటుగా సమాధానమిచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆఫ్ఘనిస్తాన్‌ను తేలికగా తీసుకోవడం లేదు..

‘మేము ఆఫ్ఘనిస్థాన్ జట్టును తేలికగా తీసుకోం. టీ20 ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ ప్రమాదకరమైన జట్టు. ఈ ప్రపంచకప్‌లో ఆ జట్టు మంచి ప్రదర్శన చేసింది. వారికి అంత అంతర్జాతీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వారి ఆటగాళ్లలో కొందరు మన ఆటగాళ్ల కంటే ఎక్కువ T20 లీగ్‌లలో క్రమం తప్పకుండా ఆడారు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టారు. అఫ్గానిస్థాన్ జట్టును తేలిగ్గా తీసుకోలేం’ అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..