IND vs AFG: సూపర్ 8 సమరానికి సై.. ఇవాళ అఫ్గాన్ vs టీమిండియా.. మ్యాచ్ టైమింగ్స్, వెదర్ రిపోర్ట్స్ ఇవే
T20 ప్రపంచ కప్‌లో సూపర్-8 రౌండ్‌లో భాగంగా గురువారం (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడనున్నాయి . బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలచి రెండో రౌండ్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీ20 క్రికెట్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు మొత్తం 8 సార్లు తలపడ్డాయి.

T20 ప్రపంచ కప్‌లో సూపర్-8 రౌండ్‌లో భాగంగా గురువారం (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడనున్నాయి . బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలచి రెండో రౌండ్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీ20 క్రికెట్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు మొత్తం 8 సార్లు తలపడ్డాయి. ఈసారి 7 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ రెండో రౌండ్‌లో ఇరు జట్లు మళ్లీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాబోయే మ్యాచ్‌ల్లో ఇరు జట్లు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉన్నందున ఇప్పుడు ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. అందుకే తొలి మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు ఖాతాటీ తెరవాలన్నది రెండు జట్ల ప్రధాన ఉద్దేశంగా ఉంది.
మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే? బార్బడోస్ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పగటిపూట అంటే ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? ఈ ఇండియా-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ లో లైవ్ టెలికాస్ట అవుతుంది.
ఉచితంగా చూడటం ఎలా? ఈ మ్యాచ్‌ను డిస్నీ హాట్ స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. అలాగే, డిస్నీ హాట్ స్టార్ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అయితే ఇందు కోసం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
రెండు జట్లు:
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
Sir Wesley Hall chats up with #TeamIndia members ahead of the #T20WorldCup Super Eight game against Afghanistan 👌👌
He also presented his newly launched book – Answering The Call 📖
WATCH 🎥🔽 – By @RajalArora
— BCCI (@BCCI) June 19, 2024
ఆఫ్ఘనిస్థాన్ జట్టు
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోటీ, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నవీన్ మఖ్విల్ హఖ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..