వామ్మో.. వీళ్లు మామూలు ఆడోళ్లు కాదురోయ్..
నంద్యాల పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడలిలో దొంగలు రెచ్చిపోయారు. సాధారణ కస్టమర్స్‌లా నటిస్తూ వచ్చి, కన్నుగప్పి వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల మెయిన్ బజార్‌లోని హెచ్.ఎం. జ్యువెలరీ షాపునకు ఇద్దరు మహిళలు వెండి పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చారు. షాపు యజమాని అల్తాఫ్‌ను మాటల్లో దించిన ఆ కిలేడీలు, మంచి మోడల్ పట్టీలు చూపించమని అడిగారు.
అతను తమవద్ద ఉన్న వెండి పట్టీలు వారి ముందు ఉంచి చూపించారు. వాటిలో ఒక జత సెలెక్ట్ చేసినట్టు చేసి వాటి తూచి..ధర చెప్పమన్నారు. అతను పట్టీలకు ధర కట్టే పనిలో ఉండగా వారిలో ఓ మహిళ రెండు జతల పట్టీలను చాకచక్యంగా నొక్కేసింది. ఆ తర్వాత పట్టీలు మోడల్ నచ్చలేదని, ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి జారుకున్నారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన అల్తాఫ్, వారు వెళ్ళిన వెంటనే షాపులోని సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో ఆ మహిళలు పట్టీలను దొంగిలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో లబోదిబోమన్న బాధితుడు వెంటనే నంద్యాల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిసి పుటేజీని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
వామ్మో.. వీళ్లు మామూలు ఆడోళ్లు కాదురోయ్..
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
'వయసు' పెరిగింది.. 'మనసు' మారింది!
నరహంతక బంటి..ఎట్టకేలకు చిక్కింది
వైద్యసిబ్బంది నిర్లక్ష్యం..ఆరేళ్ల పసిప్రాణం బలి!
వ్యూస్ కోసం డెవిల్ క్రాబ్ తిని మృత్యువాత

