కర్ణాటకలోని రాయర్ దొడ్డికి చెందిన పార్వతమ్మ వానరాలతో అపురూప అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆమె నిత్యం కోతులకు ఆహారం అందిస్తూ ప్రేమను పంచేవారు. ఇటీవల పార్వతమ్మ కన్నుమూయగా, ఆమె మృతదేహం వద్దకు వచ్చిన ఓ కోతి భావోద్వేగంగా ఆమెను కౌగిలించుకుని విలపించింది. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది.