సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..
కన్నవారిని చూడాలనే ఆత్రుత.. సొంత ఊరిపై ఉన్న మమకారం.. ఆ యువకుడిని మృత్యువు వైపు నడిపించాయి. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడి భవిష్యత్తు కంటైనర్ రూపంలో వచ్చిన ప్రమాదానికి బలైపోయింది. ఈ ఘటన చిత్తూరులో విషాదాన్ని నింపింది. గుడిపాల మండలం-190 రామాపురం గ్రామానికి చెందిన అనుదీపక్, బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
తన సొంత కారులో ఊరికి వస్తుండగా, ఇరువారం చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాదమరి నుంచి జాతీయ రహదారిని దాటబోతున్న ఒక బైక్ యువకుడిని తప్పించబోయి, చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న భారీ కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో పక్కనే ఉన్న అనుదీపక్ కారుపై ఆ కంటైనర్ ఒక్కసారిగా పడిపోయింది. భారీ కంటైనర్ పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఒంటరిగా ఉన్న అనుదీపక్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు, టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్, జేసీబీ సహాయంతో గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. రహదారి భద్రత మరియు అప్రమత్తత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

