నల్గొండ జిల్లా మర్రిగూడలో ఓ బైకర్ చావు అంచు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మలుపు వద్ద గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడగా, బైకర్ ఒక అడుగు దూరంలో పడిపోయాడు. వెంట్రుకవాసిలో జరిగిన ఈ ప్రమాదం వణుకు పుట్టిస్తోంది.