స్టార్ హీరో కొడుకుతో తమన్నా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..

Rajitha Chanti

Pic credit - Instagram

14 February 2026

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉండేది తమన్నా. స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

కానీ కొన్నాళ్లుగా సినిమాల్లో నటించడం లేదు. కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని టాక్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకంటే చిన్నవాడితో రొమాన్స్ చేయడానికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తుంది. 

తమన్నా అదిరిపోయే స్టెప్పులు, తనదైన నటనతో అందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన కథల విషయంలో అచితూచి అడుగులు వేస్తుంది. 

అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జోడిగా తమన్నా కనిపించనున్నట్లు టాక్. హారర్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రాన్ని శశాంక్ గోష్ తెరకెక్కిస్తున్నారట.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా వయసు 36 సంవత్సరాలు కాగా.. జునైద్ వయసు 32 ఏళ్లు.

ఇద్దరి మధ్య నాలుగు సంవత్సరాల వయసు తేడా ఉండడం గమనార్హం. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏ ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట చర్చ నడుస్తుంది.

జునైద్ ఖాన్ సాయి పల్లవితో కలిసి ఏక్ దిన్ అనే చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కాబోతున్నట్లు టాక్.