T20 World Cup 2024: బంగ్లాపై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. టీమిండియాదే టీ20 వరల్డ్ కప్ అంటోన్న ఫ్యాన్స్.. ఎలాగంటే?

Australia vs Bangladesh,T20 World Cup 2024: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ టీ20 ప్రపంచకప్ 2024‌లో హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ చివరి రెండు ఓవర్లలో ఈ హ్యాట్రిక్ పూర్తి చేశాడు కమిన్స్.

T20 World Cup 2024: బంగ్లాపై ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. టీమిండియాదే టీ20 వరల్డ్ కప్ అంటోన్న ఫ్యాన్స్.. ఎలాగంటే?
Team India
Follow us

|

Updated on: Jun 21, 2024 | 11:55 AM

Australia vs Bangladesh,T20 World Cup 2024: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ టీ20 ప్రపంచకప్ 2024‌లో హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ చివరి రెండు ఓవర్లలో ఈ హ్యాట్రిక్ పూర్తి చేశాడు కమిన్స్. మహ్మదుల్లా, మెహదీ హసన్, తౌహీద్ హృదయ్‌ల వికెట్లను తీసి T20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ చివరి 2 బంతుల్లో మహ్మదుల్లా, మెహదీ హసన్‌ను అవుట్ చేసిన ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్, 20వ ఓవర్ తొలి బంతికి హృదయ్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది 7వ హ్యాట్రిక్. ఈ ఫీట్‌తో టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా పాట్ కమిన్స్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. పాట్ కమిన్స్ బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సాధించేటప్పుడు మూడు రకాల బంతులు వేశాడు. షార్ట్ బాల్‌లో మహ్మదుల్లాను పెవిలియన్‌కు పంపాడు. లెంగ్త్ బాల్‌తో మెహదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చాడు జంపకర్వి. తౌహీద్ హృదయ్ స్లో బాల్‌లో ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌పై కమిన్స్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్రెట్ లీ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో బ్రెట్ లీ హ్యాట్రిక్ సాధించాడు. ఆ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. బ్రెట్ లీ కూడా బంగ్లాదేశ్‌పైనే హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.

కాగా ఈ ఏడాది T20 ప్రపంచ కప్ 2024లో, బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా బౌలర్ మాత్రమే హ్యాట్రిక్ సాధించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌ను టీమిండియా గెలుస్తుందనడానికి ఇదే సంకేతమనే చర్చలు మొదలయ్యాయి. దీనిపై నెట్టింట విస్తృతంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన క్రికెట్ ప్రపంచంలో 7వ బౌలర్ పాట్ కమిన్స్. బ్రెట్ లీ తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌కు చెందిన కర్టిస్‌ కాంప్‌ఫర్‌ 2021 టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా, దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడ హ్యాట్రిక్‌లు సాధించారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో యూఏఈకి చెందిన కార్తీక్ మయపన్, ఐర్లాండ్‌కు చెందిన జోస్ లిటిల్ ఈ ఘనత అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!