శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే: సూర్యకుమార్ యాదవ్
India vs New Zealand Final T20 World Cup 2026: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే, చివరకు సూర్యసేన ఆధ్వర్యంలో భారత జట్టు 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

India vs New Zealand Final T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు (India national cricket team) జట్టు ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ (England national cricket team) పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) లో జరిగిన ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను మ్యాచ్ హీరోలుగా నిలిచిన సంజూ శాంసన్ (Sanju Samson) లేదా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కాకుండా ఫీల్డింగ్ కోచ్ టీ దిలిప్ (T Dilip) కు ప్రత్యేక క్రెడిట్ ఇచ్చాడు.
ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌కు క్రెడిట్..
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “మన ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌కు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలి. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ చాలా కీలక పాత్ర పోషించింది” అంటూ చెప్పుకొచ్చాడు. సెమీఫైనల్ లాంటి ఒత్తిడి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే జట్టు విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చాడు.
వరుసగా రెండో అంతర్జాతీయ ఫైనల్..
ఈ విజయంతో భారత్ మరోసారి అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరింది. 2024లో సాధించిన విజయానంతరం ఇప్పుడు మరో టైటిల్ గెలిచే అవకాశాన్ని పొందింది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరుగుతుంది. ఇందులో భారత్ న్యూజిలాండ్ (New Zealand national cricket team) తో తలపడనుంది.
ఇంగ్లాండ్ చివరి వరకు పోరాటం..
254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. ఇంగ్లాండ్ తరపున జాకెబ్ బెథెల్ (Jacob Bethell) అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 105 పరుగులు చేసి జట్టును పోటీలో నిలిపాడు.
అతనికి తోడుగా విల్ జాక్స్ (Will Jacks) 35, జాస్ బట్లర్ (Jos Buttler) 25 పరుగులు చేశారు. అయినప్పటికీ చివరికి ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.
సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్..
భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు మాత్రం సంజూ శాంసన్ (Sanju Samson). అతను 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 బౌండరీలు, 7 సిక్సర్లు ఉన్నాయి.
అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (Ishan Kishan) 39, శివం దుబే (Shivam Dube) 43, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 27, తిలక్ వర్మ (Tilak Varma) 21 కీలక పరుగులు చేసి భారత్ 20 ఓవర్లలో 253/7 భారీ స్కోర్ నమోదు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక స్కోర్‌గా కూడా నిలిచింది.
ఫైనల్‌పై ఉత్కంఠ..
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య భారీ పోరు జరగనుంది. గత ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడటం వల్ల అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
