ట్రైన్ ఇంజన్‌లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరే ముందు నిర్వహించిన తనిఖీల్లో లోకో పైలట్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. టార్చ్‌లైట్‌తో ఇంజన్‌ను పరిశీలిస్తుండగా ముందు భాగంలో మనిషి తల ఇరుక్కొని ఉండటాన్ని గుర్తించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రైల్వేస్టేషన్‌లో ట్రైన్ బయలుదేరే ముందు లోకో పైలట్ టార్చ్ లైట్ వేసుకుని ట్రైన్ ఇంజన్ అలాగే… భోగిల కింద తనిఖీ చేశాడు. ఈ క్రమంలోనే.. ట్రైన్ ఇంజన్ ముందు భాగంలో సీన్ చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు.. రైలు ఇంజన్ ముందు భాగంలో ఒక మనిషి తలకాయ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన లోకో పైలట్.. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అసలు రైల్ ఇంజన్ లోకి మనిషి తలకాయ మాత్రమే ఎలా వచ్చిందంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ లో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా లోకో పైలట్ ట్రైన్ ఇంజన్ వద్ద టార్చ్ లైట్ వేసుకుని తనిఖీ చేస్తుండగా ఒక మనిషి తలకాయ కనిపించింది. వెంటనే లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు… అసలు రైలు ఇంజన్ లోకి మనిషి తల ఎలా వచ్చిందో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. ట్రైన్ హిందూపురం రైల్వే స్టేషన్ కు రాకముందే.. హిందూపురం మండలం మలుగూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని… రైలు కింద పడిన వ్యక్తి తల తెగిపడి రైలు ఇంజన్ దగ్గర ఇరుక్కోవడంతో హిందూపురం రైల్వే స్టేషన్ వరకు అలాగే వచ్చిందని విచారణలో తేలింది.
కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మిడిగేసికి చెందిన రఘునాథ్ అనే వ్యక్తి అప్పుల బాధతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు విచారణలో తేలింది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు మృతిని తల తెగిపడి రైలు ఇంజన్లో ఇరుక్కోవడంతో… అలాగే లోకో పైలట్ హిందూపురం రైల్వే స్టేషన్ వరకు రావడం… రైల్వే స్టేషన్ లో ఇంజన్ తనిఖీ చేస్తుండగా రఘునాథ్ తలను లోకో పైలట్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఎక్కడైతే రఘునాథ్ ఆత్మహత్య చేసుకున్నాడో.. స్పాట్ కు వెళ్లి చూడగా అక్కడ రఘునాథ్ డెడ్ బాడీ రైల్వే పోలీసులు గుర్తించారు.
రఘునాథ్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశానికి.. హిందూపురం రైల్వే స్టేషన్ కు దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంది. రాత్రి వేళలో ట్రైన్ కింద ఏదో పడిందని మాత్రమే లోకో పైలట్ గమనించినట్లు.. అనంతరం రైలు హిందూపురం రైల్వే స్టేషన్ కు వచ్చిన తర్వాత టార్చ్ లైట్ తో చెక్ చేస్తుండగా మనిషి తల గుర్తించినట్లు పైలట్ వెల్లడించారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మద్యం, పేకాటకు బానిసై అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
