T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఘోర పరాభవం.. సంచలన ప్రకటన చేసిన షోయబ్ మాలిక్
మన పరిస్థితి ఇలా ఉంటే టీ 20ప్రపంచకప్ లో భారీ ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి మొదటి రౌండ్ లోనే నిష్ర్కమించిన పాక్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా యూఎస్‌ఏ జట్టు చేతిలో ఓడిపోవడం పాక్ క్రికెట్ అభిమానలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇదిలా ఉండగానే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సంలచన ప్రకటన చేశాడు
టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు నిలకడగా మ్యాచ్‌లు గెలుస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. తాజాగా గురువారం (జూన్ 20న) జరిగిన సూపర్ 8 తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. మన పరిస్థితి ఇలా ఉంటే టీ 20ప్రపంచకప్ లో భారీ ఆశలు, అంచనాలతో అడుగు పెట్టి మొదటి రౌండ్ లోనే నిష్ర్కమించిన పాక్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా యూఎస్‌ఏ జట్టు చేతిలో ఓడిపోవడం పాక్ క్రికెట్ అభిమానలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇదిలా ఉండగానే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సంలచన ప్రకటన చేశాడు. అందంటంటే.. తాను మళ్లీ జట్టులోకి రావాలనుకుంటున్నాడట. టీమ్ ను విజయాల బాట పట్టించాలనుకుంటున్నాడట. ‘నేను మళ్లీ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలనుకుంటున్నాను. నా దేశం కోసం నా వంతు కృషి చేస్తాను. నేను పాకిస్థాన్‌కు ఛాంపియన్స్ ట్రోఫీని అందివ్వాలనుకుంటున్నాను’ అని చెప్పాడు మాలిక్. సంక్షిప్తంగా, షోయబ్ మాలిక్ వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడాలని తన కోరికను వెలిబుచ్చాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. దీంతో టీమ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా పాక్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి జట్టులోకి రావాలని షోయబ్ మాలిక్ తన కోరికను వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టుకు దూరమైనప్పటికీ 42 ఏళ్ల షోయబ్ మాలిక్ ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదు. షోయబ్ మాలిక్ చివరిసారిగా నవంబర్ 2021లో బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు షోయబ్ మాలిక్ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. టీమిండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన అతను కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ నటిని పెళ్లాడాడు. అంతేకాదు తన మూడో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
– Eid Greetings to the Muslim community around the globe. Spread love, happiness and positivity on this meethi eid, may Allah accept our fasting and prayers ameen ✨ pic.twitter.com/0p4OBAgyKt
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) April 9, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..