IND vs BAN: గెలిస్తే సెమీస్‌కే.. ఇవాళ బంగ్లాతో తలపడనున్న టీమిండియా.. ఆ ఇద్దరి ప్లేయర్లపై వేటు
IND vs BAN, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్‌లో టీం ఇండియా తన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది . ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శనివారం (జూన్ 22) జరిగే ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం.
IND vs BAN, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్‌లో టీం ఇండియా తన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది . ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శనివారం (జూన్ 22) జరిగే ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం. ఎందుకంటే ఇంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌పై భారత జట్టు గెలిచి 2 పాయింట్లు సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై గెలిస్తే మరో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది. దీంతో ఈరోజు టీమ్ ఇండియా గెలిస్తే సెమీఫైనల్ చేరేందుకు మార్గం సుగమం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన బంగ్లాదేశ్ ఈరోజు భారత్ చేతిలో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. టీ20 క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. టీమ్ ఇండియా 12 మ్యాచుల్లో విజయం సాధించగా, బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. అలాగే ఈ టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది. దీంతో నేటి మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
టైమింగ్స్ ఇవే..
ఆంటిగ్వా వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో పాటు స్టార్ నెట్‌వర్క్ స్పోర్ట్స్ ఛానెల్స్ అన్నింటిలోనూ ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. అలాగే డిస్నీ హాట్ స్టార్ మొబైల్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. అలాగే, డిస్నీ హాట్ స్టార్ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది, దీని కోసం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
రెండు జట్లు:
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్ జట్టు: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, ముహమ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ ఇస్లాం, తన్వే రహమాన్, , షోరిఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్.
Banter, insights and more 😎
Post-win conversations with Player of the Match Suryakumar Yadav and all-rounder Axar Patel 🥳 – By @RajalArora
WATCH 🎥 🔽 #TeamIndia | #T20WorldCup | #AFGvIND | @surya_14kumar | @akshar2026
— BCCI (@BCCI) June 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..