Adivi Sesh: సన్నీ లియోన్ కారణంగా పేరు మార్చుకున్న అడివి శేష్.. ఒరిజినల్ నేమ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ ఉన్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా రైటర్ గానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు శేష్. కెరీర్ ప్రారంభంలో సొంతం, కర్మ, పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు అడివి శేష్.

Adivi Sesh: సన్నీ లియోన్ కారణంగా పేరు మార్చుకున్న అడివి శేష్.. ఒరిజినల్ నేమ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Adivi Sesh, Sunny Leone
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2024 | 1:25 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ ఉన్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా రైటర్ గానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు శేష్. కెరీర్ ప్రారంభంలో సొంతం, కర్మ, పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు అడివి శేష్. ఇదే క్రమంలో క్షణం సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత గూఢచారి, హిట్‌ 2, ఎవరు? మేజర్‌.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో శేష్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గూఢచారి 2, డెకాయిట్ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో హీరోగానే నటించడమే కాకుండా స్క్రీన్ రైటర్ గానూ వ్యవహరిస్తున్నాడు అడివి శేష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న శేష్ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

. ఈ క్రమంలో తన అసలు పేరేంటో బయటపెట్టేశాడు శేష్. తన ఒరిజినల్‌ నేమ్‌ సన్నీ చంద్ర అని చెప్పాడు. ‘అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ ఏడిపించేవారు. అక్కడ ఆరెంజ్‌ ఫ్లేవర్‌లో సన్నీ డిలైట్‌ అని ఓ జ్యూస్‌ ఉండేది. అలాగే అప్పట్లో నటి సన్నీలియోన్‌ చాలా ఫేమస్. అయితే నా పేరులోనూ సన్నీ ఉండటంతో అందరూ టీజ్ చేసేవారు. ఇదే విషయం నాన్నకు కూడా చెప్పాను. అయితే శేష్‌ అనే పేరు మార్చుకో అని సూచించారు. అప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. సునీల్‌ గవాస్కర్‌ అభిమానిని కాబట్టి సన్నీ అని పెట్టాను. పూజారి శ అక్షరంతో పేరుండాలని చెప్పారు. అలా నీకు శేషు అనే పేరు కూడా ఉందన్నాడు. అప్పటి నుంచి నా పేరు అడివి శేష్‌గా మారింది’ అని తన పేరు వెనకనున్న అసలు కథను చెప్పుకొచ్చాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో.

ఇవి కూడా చదవండి

కాగా డెకాయిట్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని ప్రతి సీన్‌, డైలాగ్‌ను హిందీతోపాటు తెలుగులోనూ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.