Tollywood: ఈ ఫొటోలో తల్లితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో సంచలనాలకు చిరునామా.. ఇప్పుడు సైలెంట్

పై ఫొటోలో తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్నది ఎవరో గుర్తు పట్టారా? అతనొక టాలీవుడ్ సెలబ్రిటీ. అలాగనీ స్టార్ హీరో కాదు. అయితే అంతకు మించిన ఫాలోయింగ్ అతని సొంతం. అదేదో సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లు 'నలుగురికి నచ్చినది నాకసలు ఇక నచ్చదులే' అనే టైపు అన్నమాట. అతను ఏం చేసినా సంచలనమే

Tollywood: ఈ ఫొటోలో తల్లితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో సంచలనాలకు చిరునామా.. ఇప్పుడు సైలెంట్
Tollywood Celebrity
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2024 | 2:41 PM

పై ఫొటోలో తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్నది ఎవరో గుర్తు పట్టారా? అతనొక టాలీవుడ్ సెలబ్రిటీ. అలాగనీ స్టార్ హీరో కాదు. అయితే అంతకు మించిన ఫాలోయింగ్ అతని సొంతం. అదేదో సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లు ‘నలుగురికి నచ్చినది నాకసలు ఇక నచ్చదులే’ అనే టైపు అన్నమాట. అతను ఏం చేసినా సంచలనమే. కొన్ని సార్లు ఇదే సంచలనాలు వివాదాలుగా కూడా మారుతుంటాయి. అయితే ఎన్ని వివాదాలోచ్చినా, ప్రస్తుతం అతని స్టార్ డమ్ తగ్గినా టాలీవుడ్ గొప్ప దర్శకుల్లో ఈ డైరెక్టర్ పేరు కచ్చితంగా ఉండాల్సిందే. కెరీర్ ప్రారంభంలో పెద్ద హీరోలతో బ్లాక బస్టర్లు తీసి సంచలనాలు సృష్టించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పొలిటికల్ బయోపిక్ లంటూ చేతులు కాల్చుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పై ఫొటోలో డైరెక్టర్ పక్కన ఉన్నది అతని మాతృమూర్తి. ఏ సందర్భంలో దిగారో కానీ ఇద్దరు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపారు రామ్ గోపాల్ వర్మ. ఏపీ రాజకీయాల నేపథ్యంలో వ్యూహం, శపథం సినిమాలు తీశారాయన. అయితే ఇందులో వ్యూహం మాత్రమే రిలీజైంది. అది కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా తీవ్ర ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా టీడీపీ నేతలు రామ్ గోపాల వర్మ సినిమాను ఆపేయాలంటూ కోర్టుమెట్లెక్కారు. వ్యూహం, శపథం రెండు సినిమాల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆర్జీవీ. అయితే కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో టాలెంట్ హంట్ నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే వారిని తన వంతు ప్రోత్సహించేందుకు ఈ ట్యాలెంట్ హంట్ నిర్వహించారు. ఇందుకు మంచి రెస్పాన్సే వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్