చదువు పూర్తి కాగానే కుంబలంగి నైట్స్ (2019)తో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఉత్తమ పరిచయ నటిగా సైమా, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ సహా పలు పురస్కారాలు అందుకుంది. కమర్షియల్ గానూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత హెలెన్, కప్పేలా, నారదన్, నైట్ డ్రైవ్, కాపా వంటి చిత్రాల్లో నటించింది.