Tollywood: పోలికలు చూసి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? ఇటీవలే దెయ్యంగా భయపెట్టిన హీరోయిన్

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్. గతంలో పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. సినిమా ఇండస్ట్రీలో ఆమెది 20 ఏళ్ల ప్రస్థానం. అయితే ఎందుకో మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుంది. కానీ గోడకు కొట్టిన బంతిలా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ట్రెండింగ్ లో ఉంటోంది

Tollywood: పోలికలు చూసి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? ఇటీవలే దెయ్యంగా భయపెట్టిన హీరోయిన్
Tollywood Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Jun 22, 2024 | 11:53 AM

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్. గతంలో పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. సినిమా ఇండస్ట్రీలో ఆమెది 20 ఏళ్ల ప్రస్థానం. అయితే ఎందుకో మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుంది. కానీ గోడకు కొట్టిన బంతిలా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ట్రెండింగ్ లో ఉంటోంది. నటిగా మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఓ సోషియో ఫాంటసీ హారర్ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇందులో కీలక పాత్ర పోషించిందీ అందాల తార. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అబ్బాయిలను వలలో వేసుకుని మట్టు పెట్టే అమ్మాయి పాత్రలో అందరినీ భయపెట్టింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయో? యస్ ఈ చిన్నారి మరెవరో కాదు ఇటీవల యక్షిణి వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చిన హీరోయిన్ వేదిక. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ప్రస్తుతం యక్షిణి వెబ్ సిరీస్ లో ట్రెండింగ్ లో ఉండడం, వేదిక నటనకు మంచి పేరు రావడంతో ఈ అమ్మడి చిన్ననాటి, త్రో బ్యాక్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

అప్పుడెప్పుడో సుమారు 20 ఏళ్ల క్రితం బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వేదిక. అందులో అమాయక సుబ్బలక్ష్మిగా ఆమె అభినయం పలువురి ప్రశంసలు అందుకుంది. కానీ ఎందుకోగానీ ఈ బ్యూటీ ఫేమస్ కాలేకపోయింది. కల్యాణ్ రామ్ విజయదశమి, రాఘవ లారెన్స్ ముని, సుమంత్ దగ్గరగా దూరంగా వంటి కొన్ని సినిమాలు మాత్రమే ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాల సినిమాల్లో ఎక్కువగా నటించింది వేదిక. అక్కడే మంచి పేరు సొంతం చేసుకుంది. ఆ మధ్యన కాంచన 3, బాలయ్య రూలర్, నాగార్జున బంగర్రాజు సినిమాల్లో నటించి మళ్లీ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ ఏడాది వివాదాస్పద మూవీ రజాకార్ చిత్రంలో యాక్ట్ చేసిన వేదిక.. తాజాగా హారర్ వెబ్ సిరీస్ యక్షిణీలో మాయ పాత్రలో అందరినీ భయపెట్టింది. ఇందుకోసం ఆమె ఎంతగానో కష్టపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక రాబోయే ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం వేదిక చేతిలో గణతో పాటు ఫియర్, పెటరప్, వినోదన్, చేతి మాంద్రం తులసి, జంగిల్, నాలం తూను వంటి ఏడుకు పైగా సినిమాలున్నాయి.

ఇవి కూడా చదవండి

యక్షిణి వెబ్ సిరీస్ కోసం వేదిక కష్టం.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే